వన్‌ప్లస్‌ నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌..!

OnePlus To Launch Phones Priced Under Rs 20000 In India - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వన్‌ప్లస్‌ భారతీయ మార్కెట్‌లో పాగవేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది.  భవిష్యత్తులో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తోంది. రూ. 20 వేల కంటే తక్కువ ధరల్లో లాంచ్‌ చేయాలని వన్‌ప్లస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2022 రెండో త్రైమాసికంలో ఈ బడ్జెట్‌ ఫోన్లను భారత మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసేందుకు వన్‌ప్లస్‌ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పోతో విలీనం చెందిన తరువాత వన్‌ప్లస్‌ తన ఆక్సిజన్‌ఓఎస్‌ను ఓప్పో కలర్‌ఓఎస్‌తో వీలినం చేస్తోన్నట్లు ప్రకటించింది.       

చదవండి: Gmail: జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌...!

ప్రముఖ డేటా ఇంజనీర్,  ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ యోగేష్ బ్రార్ వన్‌ప్లస్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం వన్‌ప్లస్‌ నార్డ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ రూ. 20 వేలపైనే ఉన్నట్లు తెలిపారు. నార్డ్‌ సిరీస్‌లో భాగంగా మార్కెట్‌లోకి సరసమైన ధరలకు (రూ. 20 వేల కంటే తక్కువ) స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంతో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లను శాసించాలని వన్‌ప్లస్‌ చూస్తోందని యోగేష్‌ బ్రార్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవలి వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 200-5 జీ వంటి ఫోన్‌లను కంపెనీ యుఎస్ , కెనడా వంటి మార్కెట్లలో ప్రవేశపెట్టింది. అయితే ఈ మోడల్స్‌ను ఇంకా భారత్‌లోకి తీసుకురాలేదు.

చదవండి: Google Photos: మీ స్మార్ట్‌ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top