‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్‌ అగర్వాల్‌ | Ola Move To Krutrim Cloud From Microsoft Azure | Sakshi
Sakshi News home page

‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్‌ అగర్వాల్‌

May 11 2024 9:36 PM | Updated on May 12 2024 11:27 AM

Ola Move To Krutrim Cloud From Microsoft Azure

ప్రముఖ దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ దిగ్గజం ఓలా.. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చింది.  లింక్డిన్‌లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీస్‌ అజ్యూర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇకపై అజ్యూర్‌ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్‌ ఏఐ క్లౌడ్‌ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ ప్రకటించారు

ఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్‌ ఏఐ బాట్‌లో భవీష్‌ అగర్వాల్‌ ఎవరు? అని సెర్చ్‌ చేశారు. దీనికి బాట్‌ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్‌ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్‌ చేశారు.

ఆ కామెంట్లతో లింక్డిన్‌ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్‌ పోస్ట్‌ ఉందంటూ దానిని లింక్డిన్‌ డిలీట్‌ చేసింది. దీంతో లింక్డిన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్‌.. మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌కు గుడ్‌ బై చెప్పారు. లింక్డిన్‌ చర్యతో మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్‌ క్లౌడ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement