స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు | Oil Companies Cut Down Petrol And Diesel Prices | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

Sep 5 2021 9:54 AM | Updated on Sep 5 2021 9:57 AM

Oil Companies Cut Down Petrol And Diesel Prices - Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో మరోసారి పెట్టోలు, డీజిలు ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలు, డీజిల్‌లకు సంబంధించి లీటరుపై 15 పైసల వంతున ధరను ఆదివారం చమురు కంపెనీలు తగ్గించాయి. ఈ నెలలో పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండో సారి. తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 105.26గా ఉంది. డీజిల్‌ ధర రూ. 96.69లుగా ఉంది.

మేలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా పెట్రోలు, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. దీంతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటగా, డీజిల్‌ ధర సెంచరీకి చేరువైంది. అయితే ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పడిపోవడం ప్రారంభమైంది. బ్యారెల్‌ ముడి చమురు ధర 75 డాలర్ల నుంచి 64 డాలర్లకు పడిపోయింది. కొద్ది కాలంగా కొంచెం అటుఇటుగా అక్కడే కొనసాగుతోంది. దీంతో చమురు కంపెనీలు కొద్ది కొద్దిగా ధరలను తగ్గిస్తున్నాయి.

చదవండి: ఇండియన్‌ ఆయిల్‌ కొత్త మస్కట్‌ ఇదే

Advertisement
 
Advertisement
Advertisement