కొత్త ఏడాది తొలి రోజూ రికార్డ్స్‌తో బోణీ | New year day Market ends with record highs | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది తొలి రోజూ రికార్డ్స్‌తో బోణీ

Jan 1 2021 3:58 PM | Updated on Jan 1 2021 4:25 PM

New year day Market ends with record highs - Sakshi

ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లకు కొత్త జోష్‌ వచ్చింది. దీంతో సెన్సెక్స్‌ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. వెరసి వరుసగా 8వ రోజూ మార్కెట్లు లాభపడగా.. మరోసారి సరికొత్త గరిష్ట రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్‌ 118 పాయింట్ల వృద్ధితో 47,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 14,019 వద్ద స్థిరపడింది. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్‌-19 కట్టడికి ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 47,980ను తాకగా.. నిఫ్టీ 14,050కు చేరింది.  (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్‌)

ఐటీ, ఆటో..
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.3 నీరసించగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3.3 శాతం ఎగశాయి. ఈ బాటలో ఆటో, ఐటీ, రియల్టీ 1 శాతం స్థాయిలో లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఎయిర్టెల్‌, బజాజ్‌ ఆటో, సన్‌ ఫార్మా, సిప్లా 4.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఎస్‌బీఐ లైఫ్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ 1.4-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి.

బీహెచ్ఈఎల్‌ జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో బీహెచ్‌ఈఎల్‌, చోళమండలం, ఐడియా, బీఈఎల్‌, పీఎన్‌బీ, బీవోబీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, లాల్‌పాథ్‌, పిరమల్‌, కెనరా బ్యాంక్‌ 8-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎస్‌బీఐ లైఫ్‌, బాలకృష్ణ, ఇండిగో, హావెల్స్‌, మదర్‌సన్‌, వేదాంతా 1.4-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,046 లాభపడగా.. 953 మాత్రమే నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement
 
Advertisement
Advertisement