డాలర్ల ప్రవాహానికి ఆర్‌బీఐ రూట్‌ మ్యాప్‌ | RBI, govt unveil measures to attract foreign inflows in bonds, equities | Sakshi
Sakshi News home page

డాలర్ల ప్రవాహానికి ఆర్‌బీఐ రూట్‌ మ్యాప్‌

Jun 6 2026 5:40 AM | Updated on Jun 6 2026 5:40 AM

RBI, govt unveil measures to attract foreign inflows in bonds, equities

ఈ ఏడాది ఇప్పటివరకూ 6 శాతం క్షీణించిన రూపాయికి ప్రోత్సాహాన్నిస్తూ ఆర్‌బీఐ ప్రధానంగా విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, పీఎస్‌యూల విదేశీ వాణిజ్య రుణాలు, ఎఫ్‌సీఎన్‌ఆర్‌ తదితర విభాగాలలో సవరణలు చేపట్టింది. ఇందుకు తీసుకున్న ఆరు చర్యలు ఏమిటంటే..

ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు 
15, 30, 40 ఏళ్ల కాలావధిగల దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లకు విస్తృత అవకాశాలకు తెరతీసింది. తద్వారా దేశీ సావరిన్‌ రుణ మార్కెట్లో మరింత అధికంగా విదేశీ పెట్టుబడులకు దారి చూపింది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ బాండ్ల మార్కెట్లో అవకాశాలు పెంచింది. ఫలితంగా దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలకు డిమాండ్‌ పుంజుకోనుంది. 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు పరిమితుల తొలగింపు 
సాధారణ మార్గంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) స్వల్పకాలిక పెట్టుబడుల పరిమితిని తొలగించింది. దీంతో దేశీ రుణ(డెట్‌) మార్కెట్లోకి సులభంగా ప్రవేశించడంతోపాటు.. ఫిక్స్‌డ్‌ ఆదాయ ఆస్తులలో పెట్టుబడులు చేపట్టేందుకు అవరోధాలు తొలగనున్నాయి.  

ఈక్విటీ పెట్టుబడులలో 
ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు), విదేశీ పౌరసత్వంగల భారతీయుల(ఓసీఐలు)కు ఈక్విటీ పెట్టుబడుల పరిమితిని పెంచింది. తద్వారా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజి్రస్టేషన్‌లేకుండానే లిస్టెడ్‌ ఈక్విటీలలో ఇన్వెస్ట్‌ చేసేందుకు తెరతీసింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఈ సౌకర్యం ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఐలకు వర్తించనుంది. ఫలితంగా ఎఫ్‌పీఐలతోపాటు.. ప్రవాస భారతీయులు సైతం భారీగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలు ఏర్పడనుంది.  

విదేశీ వాణిజ్య రుణాల ద్వారా 
ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూలు) విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీలు) ఫారెక్స్‌ స్వాప్‌(విదేశీ మారక ద్రవ్య మారి్పడి) విండోను 2026 సెపె్టంబర్‌ 30వరకూ విస్తరించింది. దీంతో స్వాప్‌ మద్దతుతోపాటు పీఎస్‌యూలకు విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించేందుకు మరింత గడువు లభించనుంది. తద్వారా ప్రపంచ రేట్లు, ముడిచమురు ధరలు, కరెన్సీ హెచ్చుతగ్గులు వంటి సవాళ్ల సమయంలో విదేశీ కరెన్సీ రుణ వ్యయాల నిర్వహణలో పీఎస్‌యూలకు వెసులుబాటును కలి్పంచింది.  

హెడ్జింగ్‌తో మద్దతు 
2026 సెపె్టంబర్‌ 30వరకూ బ్యాంకులు మూడు నుంచి ఐదేళ్ల కాలావధిగల ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్ల సమీకరణకు పూర్తిస్థాయిలో ఆర్‌బీఐ నుంచి హెడ్జింగ్‌ వ్యయాల మద్దతు లభించనుంది. ప్రవాస భారతీయుల నుంచి దేశీ బ్యాంకులు విదేశీ కరెన్సీ డిపాజిట్లను సమీకరిస్తాయి. హెడ్జింగ్‌ వ్యయాలకు మద్దతుంటే బ్యాంకులు మరింత అధికంగా ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లను సమీకరించగలుగుతాయి. తద్వారా దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి విదేశీ మారక ప్రవాహానికి వీలు కలుగుతుంది. ఇవి నిలకడైన కరెన్సీ ఫండింగ్‌కు ప్రధాన వాహకంగా నిలుస్తూ మద్దతివ్వనున్నాయి.  

ఎగుమతిదారులకు ఊరట
ఎగుమతిదారులు తమ ఎగుమతి సంబంధ విదేశీ మారక ఆర్జనను 9 నెలల్లోగా తిరిగి పొందవచ్చు. ఈ గడువు ఇప్పటివరకూ 15 నెలలుగా అమలవుతోంది. దీంతో విదేశీ కరెన్సీ ఆర్జన త్వరితగతిన భారత్‌లోకి ప్రవేశించేందుకు వీలు చిక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement