సరికొత్త ఫీచర్లతో హీరో మాస్ట్రో ఎడ్జ్‌ 125...!

New Hero Maestro Edge 125 Launched - Sakshi

ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ దేశవ్యాప్తంగా తన 125సీసీ మోడళ్లను పెంచాలని యోచిస్తోంది. ఇటీవల గ్లామర్‌ బైక్‌కు అప్‌డేట్‌ తెచ్చిన కొన్ని రోజులకే స్కూటీ డివిజన్‌లో మాస్ట్రో ఎడ్జ్‌ 125ను అప్‌డేట్‌ చేస్తూ సరికొత్త ఫీచర్లతో మాస్ట్రో ఎడ్జ్‌ 125 బైక్‌ను హీరో మోటార్‌ కార్ప్‌ రిలీజ్‌ చేసింది. ఈ బైక్‌ను సరికొత్తగా రెండు రకాల కలర్‌ వేరియంట్లతో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది.
 
కస్లమర్లకు ప్రిస్మాటిక్‌ ఎల్లో, ప్రిస్మాటిక్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్  రూపంలో న్యూ మాస్ట్రో ఎడ్జ్‌ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. న్యూ మాస్ట్రో ఎడ్జ్‌ 125 బైక్‌ బ్లూటూత్‌ కనెక్టివిటీని, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌లైట్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, టర్న్‌-బై- టర్న్‌ నావిగేషన్‌, డిజిటల్‌ స్పీడో మీటర్‌,  కాల్‌ ఆలర్ట్‌తో రానుంది. మాస్ట్రో ఎడ్జ్‌ 125 డ్రమ్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 72,250, డిస్క్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 76,500, కనెక్టెడ్‌ వేరియంట్‌ ఎక్స్‌ షో రూమ్‌ ధర రూ. 79,750గా నిర్ణయించారు. ఈ ధరలు ఢిల్లీ నగరంలో అందుబాటులో ఉంటాయి.

 

మాస్ట్రో ఎడ్జ్ 125 'ఎక్స్‌సెన్స్ టెక్నాలజీ'తో 124.6 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటారుతో రానుంది. ఇంజన్ 9బీహెచ్‌పీ సామర్థ్యంతో 7,000 ఆర్‌పీఎమ్‌ను అందిస్తోంది. 5,500 ఆర్‌పీఎమ్‌ వద్ద గరిష్టంగా 10.4ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది.టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125, హోండా గ్రాజియా 125  అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 బైక్‌లకు పోటిగా నిలవనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top