పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు! | New Gen VinFast VF8 Electric SUV Revealed With 500 Km Range | Sakshi
Sakshi News home page

పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు!

May 24 2026 3:57 PM | Updated on May 24 2026 4:25 PM

New Gen VinFast VF8 Electric SUV Revealed With 500 Km Range

వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్.. భారతదేశంలో కొత్త తరం విన్‌ఫాస్ట్ VF8 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ క్యాబిన్.. మెరుగైన టెక్నాలజీ వంటివి పొందుతుంది. కంపెనీ దీనికోసం మే 27 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు జులై నుంచి ప్రారంభమవుతాయి.

విన్‌ఫాస్ట్ VF8 మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో వింగ్స్ ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, వీ షేప్ లైటింగ్ ఎలిమెంట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనితో పాటు పెద్ద గ్లాస్-బ్లాక్ ఫేషియా కూడా ఉంటుంది. బంపర్‌లో పెద్ద ఎయిర్ ఛానెల్స్ కూడా ఉన్నాయి, ఇవి ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మరింత స్పోర్టీ లుక్ అందిస్తుంది. వెనుక డిజైన్‌ను కూడా కనెక్టెడ్ V-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

విన్‌ఫాస్ట్ VF8 పూర్తిగా కొత్త డిజైన్ క్యాబిన్‌ను పొందుతుంది. డాష్‌బోర్డ్‌లో 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది. ఈ కారు కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్-కాలమ్‌పై అమర్చిన గేర్ సెలెక్టర్‌ను కూడా పొందుతుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్‌తో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వైర్‌లెస్ కనెక్టెడ్ టెక్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, మరియు 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ SUVలో ఏడీఏఎస్ ఫీచర్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హైవే అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి. ఈ కారులో 60.13 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 500 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు.. 228 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే సంస్థ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించనుంది.

ఇదీ చదవండి: 2026 హోండా సిటీ: 27 కిమీ/లీ మైలేజ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement