2026 హోండా సిటీ: 27 కిమీ/లీ మైలేజ్! | Honda City Facelift Launched In India At Rs 12 Lakh | Sakshi
Sakshi News home page

2026 హోండా సిటీ: 27 కిమీ/లీ మైలేజ్!

May 22 2026 5:02 PM | Updated on May 22 2026 6:11 PM

Honda City Facelift Launched In India At Rs 12 Lakh

హోండా కార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో.. 2026 సిటీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే.. ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది.

2026 హోండా సిటీ కారు వోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది కొత్త ఫ్రంట్ ఫాసియా, హనీకూంబ్ గ్రిల్‌కు ఇరువైపులా కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, ఒక లైట్ స్ట్రిప్ ఉన్నాయి. ఈ కారులో హుడ్, గ్రిల్ మధ్యలో బ్రాండ్ యొక్క కొత్త లోగో కూడా ఉంది. అయితే డోర్ హ్యాండిల్స్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో ఈ సెడాన్ తన సిల్హౌట్‌ను అలాగే నిలుపుకుంది.

సెడాన్ వెనుక భాగం స్మోక్డ్ టెయిల్‌లైట్స్, వర్టికల్ రిఫ్లెక్టర్ యూనిట్లతో అప్‌డేట్ అయింది. అంతేకాకుండా.. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్‌తో బూట్ లిడ్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉంది. బంపర్ వెనుక భాగాన్ని కూడా రీడిజైన్ చేశారు. ఈ అప్‌డేట్‌లకు అనుగుణంగా క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మీటరాయిడ్ గ్రే మెటాలిక్ వంటి రంగులలో 2026 హోండా సిటీ అందుబాటులో ఉంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త హోండా సిటీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. స్టీరింగ్ వీల్ డిజైన్, అలాగే ఫిజికల్ బటన్స్ అమరిక మునుపటి మాదిరిగానే ఉన్నాయి. సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 8 స్పీకర్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఫుట్‌వీల్ లైటింగ్ వంటివాటితో పాటు.. 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏడీఏఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో కొనసాగుతోంది. ఇది 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. హైబ్రిడ్ వెర్షన్‌లో ఎలక్ట్రిక్ సపోర్ట్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజన్ ఉంది, ఇది 126 hp పవర్, 253 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 27.26 కిమీ/లీ వరకు మైలేజీని అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement