షూస్‌ను పదికాలాలు కాపాడే డివైజ్‌, ధర ఎంతంటే?

Nesugar Is A Multi Functional Shoe Dryer And Deodorizer With Temperature Control - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం పాదరక్షలకు రక్షణ సాధనం. ఖరీదైన షూస్‌ను పదిలంగా పదికాలాలు కాపాడుకోవడం కష్టమే! అయితే, ఈ పరికరం చెంతనుంటే, ఎంత సున్నితమైన, ఎంత ఖరీదైన పాదరక్షలనైనా పదిలంగా కాపాడుకోవచ్చు. 

బహుళజాతి సంస్థ ‘నెసుగర్‌’ ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది షూ డ్రైయర్‌–డీయాడరైజర్‌. చెమ్మదేరిన లేదా తడిసిపోయిన పాదరక్షలను ఇది నిమిషాల్లో పొడిగా తయారుచేస్తుంది. ఇందులో రెండు రకాల ఉష్ణోగ్రతలను అడ్జస్ట్‌ చేసుకునే అవకాశం ఉంది. షూ రకాలను బట్టి వీటిని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు.

అలాగే, ఇందులోని ఓజోన్‌ స్టెరిలైజేషన్‌ మోడ్‌ను ఆన్‌ చేసుకున్నట్లయితే, షూస్‌లోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ఫలితంగా వాటి ద్వారా వ్యాపించే దుర్గంధం కూడా నశిస్తుంది. ఈ పరికరాన్ని చక్కగా మడిచిపెట్టి భద్రపరచుకునే సౌలభ్యం ఉండటం మరో విశేషం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top