కళ్లుచెదిరే ఖరీదు! 3 అపార్ట్‌మెంట్లు.. రూ.180 కోట్లు! | Indian Billionaire Nadir Godrej Buys 3 Luxury Apartments In Mumbai Malabar Hill For Rs 180 Crore | Sakshi
Sakshi News home page

కళ్లుచెదిరే ఖరీదు! 3 అపార్ట్‌మెంట్లు.. రూ.180 కోట్లు!

Published Wed, Jun 19 2024 4:00 PM | Last Updated on Wed, Jun 19 2024 4:51 PM

Nadir Godrej buys 3 apartments in Mumbai for Rs 180 crore

దేశంలో ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు పేరుగాంచిన ముంబైలో హై వ్యాల్యూ డీల్స్‌ బయటికొస్తూనే ఉ‍న్నాయి. గోద్రేజ్ అగ్రోవెట్ చైర్మన్ నాదిర్ గోద్రేజ్ తాజాగా ఇ‍క్కడ మూడు ఖరీదైన అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. నగరంలోని మలబార్ హిల్‌లో ఆయన మూడు అపార్ట్‌మెంట్లను రూ.180 కోట్లకు కొనుగోలు చేసినట్లు లభించిన పత్రాలను బట్టి జాప్‌కీ పేర్కొంది.

13,831 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ను చదరపు అడుగుకు రూ.1.3 లక్షల చొప్పున జేఎస్‌డబ్ల్యూ రియల్టీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. వివరాల ప్రకారం ఒక్కో అపార్ట్ మెంట్ 4,610 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో ఆరు, ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో ఉన్నాయి. జూన్ 12న విక్రయ ఒప్పందం కుదిరింది. గోద్రెజ్ ఒక్కో అపార్ట్ మెంట్ కు రూ.3.5 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.

దేశంలోని సంపన్న పారిశ్రామికవేత్తలు నివసించే మలబార్ హిల్ ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటి. దివంగత బిలియనీర్ స్టాక్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా నివాసం ఇక్కడే ఉంది. అరేబియా సముద్రం వ్యూ కోసం ఆమె గత మార్చిలో ఒక భవనంలోని దాదాపు అన్ని యూనిట్లను కొనుగోలు చేశారు. గత ఏడాది పరమ్ క్యాపిటల్ డైరెక్టర్ ఆశా ముకుల్ అగర్వాల్ ముంబైలోని లోధా మలబార్‌లో మూడు అపార్ట్‌మెంట్లను రూ.263 కోట్లకు కొనుగోలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement