ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? | Mukesh Ambdani Future Daughter in Law Net Worth | Sakshi
Sakshi News home page

Radhika Merchant Net Worth: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే?

Oct 8 2023 3:45 PM | Updated on Oct 8 2023 4:23 PM

Mukesh Ambdani Future Daughter in Law Net Worth - Sakshi

ముఖేష్ అంబానీకి కాబోయే కోడలు 'రాధికా మర్చంట్' అని మాత్రమే చాలామందికి తెలుసు. అయితే ఈమె బ్యాగ్రౌండ్ ఏమిటి? సంపాదన ఎంత అనే చాలా వివరాలు తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇటీవలే రాధికాతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అనంత్ & రాధికా  చిన్ననాటి స్నేహితులు. ఈమె చాలా సంవత్సరాలుగా అంబానీ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటోంది. ఈమె ప్రముఖ వ్యాపార దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె.

క్లాసికల్ డ్యాన్సర్..
రాధిక మర్చంట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 60,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో దిగిన ఫోటోలు చాలా వరకు ఈమె ఖాతాలో చూడవచ్చు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన రాధికా మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా.

న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ అండ్ దివాన్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆమె రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్‌గా కూడా పనిచేసింది. ఆ తరువాత కుటుంబం వ్యాపారమైన ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా పనిచేసింది.

సంపద విలువ..
విలాసవంతమైన జీవనశైలిని కొనసాగిస్తున్న ఈమె ఖరీదైన దుస్తులు, వస్తువులు వినియోగించడానికి చాలా ఆసక్తి చూపుతుంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె సంపద విలువ రూ. 8 నుంచి రూ. 10 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

రాధిక మర్చంట్ తండ్రి వీరేన్ మర్చంట్ నికర విలువ దాదాపు రూ.755 కోట్లు. రాధికకు చదవడం, ప్రయాణం, ట్రెక్కింగ్ అండ్ స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. కాగా అనంత్ & రాధికా 2024 జూలై 10, 11, 12 తేదీల్లో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement