2023లో వృద్ధి 6.7 శాతం: మూడీస్‌

Moodys retains India 2023 growth forecast at 6. 7percent on strong domestic demand - Sakshi

న్యూఢిల్లీ: 2023లో భారత్‌ 6.7 శాతం వృద్ధి రేటును సాధిస్తుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని రేటింగ్‌ దిగ్గజం– మూడీస్‌ తన గ్లోబల్‌  మాక్రో ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ 2024–25లో పేర్కొంది. దేశీయ డిమాండ్‌ పటిష్టత దీనికి ప్రధాన కారణమని తెలిపింది. 2024లో 6.1 శాతం, 2026లో 6.3 శాతం భారత్‌ పురోగమిస్తున్న అభిప్రాయాన్ని మూడీస్‌ వ్యక్తం చేసింది. కాగా, జీ–20 ఎమర్జింగ్‌ మార్కెట్ల వృద్ధి 2023లో 4.4 శాతం, 2024లో 3.7 శాతం, 2025లో 3.8 శాతంగా ఉంటుందని మూడీస్‌ అంచనావేసింది.

అధిక వడ్డీరేట్ల కారణంగా 2024లో ప్రపంచ వృద్ధి స్పీడ్‌ మందగిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం భారత్‌ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. కాగా, ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్‌ వృద్ధి రేటును మూడీస్‌ 6.1 శాతంగా అంచనావేస్తున్న సంగతి తెలిసిందే. పటిష్టంగా ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు,  పెరుగుతున్న ఆటో విక్రయాలు,  వినియోగదారుల ఆశావాదం, రెండంకెల క్రెడిట్‌ వృద్ధి ఎకానమీకి సానుకూల అంశాలుగా పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top