ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్‌

Mobility Tech Company Stellantis To Expand Hyderabad Operations In Artificial Intelligence - Sakshi

నెదర్లాండ్‌ బేస్డ్‌ మొబిలిటీ టెక్‌ కంపెనీ స్టెల్లాంటీస్‌ హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించనుంది. ఫ్యూచర్‌ టెక్నాలజీగా పేర్కొంటున్న ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ బేస్డ్‌గా హైదరాబాద్‌లో కొత్త రిక్రూట్‌మెంట్స్‌ చేయాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్లగ్‌ అండ్‌ ప్లే పద్దతిలో పని చేసే స్టెల్లాంటీస్‌ సంస్థ ప్రస్తుత రెవెన్యూ 380 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 2024 నాటికి కంపెనీ రెవెన్యూ 4 బిలియన్‌ డాలర్లుకు చేరుకోవడం లక్ష్యంగా స్టెల్లాంటీస్‌ పెట్టుకుంది. అందులో భాగంగా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌కి సంబంధించి ఎస్‌టీఎల్‌ఏ బ్రెయిన్‌,  ఎస్‌టీఎల్‌ఏ స్మార్ట్‌కాక్‌పిట్‌, ఎస్‌టీఎల్‌ఏ ఆటోడ్రైవ్‌ అంటూ  మూడు ప్లాట్‌ఫామ్స్‌ రెడీ చేసింది. 

ప్రస్తుతం స్టెలాంటీస్‌ సంస్థ ఐటీ ప్రొఫెషనల్స్‌ సంఖ్య 500లుగా ఉంది. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్యను 4500లకు పెంచుకోవాలని స్టెల్లాంటీస్‌ లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ ఏషియా, అమెరికా, గ్లోబల్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ మమతా చామర్తి తెలిపారు. 

సంస్థ కొత్తగా నియమింనున్న 4500ల మంది ఐటీ ప్రొఫెషనల్స్‌లో 2200ల మంది హైదరాబాద్‌ క్యాంపస్‌కి కేటాయించారు. హైదరాబాద్‌లో మానవ వనరుల లభ్యత, వివిధ ఐటీ కంపెనీలకు నెలవై ఉండటం కారణంగా స్టెల్లాంటీస్‌ సంస్థ హైదరాబాద్‌ని భారీ స్థాయిలో విస్తరణకు ఆసక్తి చూపిస్తోంది.  స్టెల్లాంటీస్‌కి చెన్నై, పూనేలలో కూడా ఆఫీసులు ఉన్నాయి. స్టెల్లాంటీస్‌ కస్టమర్స్‌ జాబితాలో బీఎండబ్ల్యూ, ఫాక్స్‌కాన్‌, వైమో వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top