మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్‌, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే!

Microsoft Employee Salary Leaked - Sakshi

ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న ఖర్చులు. వెరసి పునర్నిర్మాణం పేరుతో ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది తాజాగా, ఆ సంస్థకు చెందిన సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌లోనూ 600 మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేసింది. అయితే, ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని చెబుతూనే, ఉద్యోగులకు కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలిస్తూ చర్చాంశనీయంగా మారింది. 

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ శాలరీలను ఎంత మొత్తంలో చెల్లింస్తుందనే డేటా లీకైంది. ఇన్‌సైడర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌ ఏయే డిజిగ్నేషన్‌కు ఎంత వేతనం చెల్లించాలని తెలిపేలా కొన్ని గైడ్‌లైన్స్‌ను తయారు చేసింది. ఈ గైడ్‌లైన్స్‌ ఆధారంగా ఆయా డిపార్ట్‌మెంట్‌లలో కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు ఎంత జీతాలు ఇవ్వాలనేది మేనేజర్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు అదే జీతాల డేటా ఆన్‌లైన్‌లో చక్కెర్లు కొడుతుంది.

   

ప్రాంతాన్ని బట్టే జీతాలు 
దీంతో పాటు సిబ్బందికి అందించే కాంపన్షేషన్ సైతం ప్రాంతాన్ని బట్టి అందిస్తుంది. మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే న్యూయార్క్‌,శాన్‌ ఫ్రాన్సిస్కోలో నివసించే ఉద్యోగులకు కాంపన్షేషన్‌ కాస్త ఎక్కువ అందిస్తున్నట్లు శాలరీలను వెలుగులోకి తెచ్చిన నివేదికలు చెబుతున్నాయి. 

ర్యాంకుల్ని బట్టి శాలరీలు 
లీకైనా వేతన మార్గదర్శకాల ప్రకారం మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల ర్యాంకులు బట్టి సంస్థ అందించే జీతాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌లో మీ ర్యాంక్‌ (leval) 70 ఉంటే మీకు కంపెనీ ఇచ్చే బేసిక్‌ పే 231,700 డాలర్ల నుంచి 361,500 డాలర్ల వరకు ఉంటుంది. ఇదే ర్యాంక్‌లో ఖచ్చితమైన శాలరీ అంటే 310,000 నుండి 1.2 మిలియన్ల డాలర్లలోపు పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. 68 ర్యాంక్ ఉన్న వారిని సీనియర్‌ ఉద్యోగిగా, లెవల్ 63, లెవల్ 65 వరుసగా సీనియర్, ప్రిన్సిపల్‌ ఉద్యోగులుగా పరిగణించబడతారని నివేదిక హైలెట్‌ చేసింది. 

అత్యల్ప స్థాయి
అదే కంపెనీలో అతి తక్కువ స్థాయి ఉద్యోగి జీతం 42,500 డాలర్ల జీతం తీసుకుంటారు. ఈ స్థాయిలో ఉన్న ఉద్యోగులు హైరింగ్ బోనస్ లేదా స్టాక్ అవార్డుకు అర్హులు కాదు.

ఫీల్డ్‌ను బట్టి ర్యాంక్‌లు మారతాయ్‌
అన్ని రకాల డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంకులు 70 వరకు వెళ్లవు. ఈ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగిని ప్రత్యేక ఇంజనీర్‌గా భావిస్తారు. అదే సమయంలో, ఇతర ఫీల్డ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంక్‌లు 80కి పైగా ఉంటాయి. 

చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమానురాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top