ఇది కదా సక్సెస్ అంటే! క్రికెట్ నుంచి సీఈఓ దాకా: సత్య నాదెళ్ల విజయ సూత్రాలు

Microsoft ceo satya nadella speaks about his studies and career - Sakshi

ప్రపంచంలోని అగ్రగామీ దేశాల్లోని కంపెనీలలో భారత సంతతికి చెందిన ఎందోరో ఉన్నతమైన పదవులను అధిరోహించారు. అలాంటి వారిలో ఒకరు మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'. భారతదేశంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈయన గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

చిన్నపాటి నుంచే తన తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ, మద్దతు వంటివి సత్య నాదెళ్లలో ఆత్మవిశ్వాసం పెంచాయని,  లింక్డ్‌ఇన్ సీఓఓ ర్యాన్ రోస్లాన్‌స్కీ నిర్వహించే ది పాత్ అనే వీడియో సిరీస్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెల్లడించారు.

పాఠశాల వయసులో చదువంటే బోరింగ్ అని, ఎప్పుడూ ద్యాసంతా క్రికెట్ మీదే ఉండేదని చెప్పుకొచ్చారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి సంస్కృతం ప్రొఫెసర్‌గా పనిచేశారని, ఈ రోజుకి కూడా తల్లిదండ్రులు నా వెనుక ఉండి భరోసా ఇస్తున్నారని గొప్పగా చెప్పారు. 

సత్య నాదెళ్ల ఇండియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆ తరువాత సన్ మైక్రోసిస్టమ్స్‌లో ఉద్యోగం ప్రారభించి బింగ్, ఎమ్ఎస్ ఆఫీస్, ఎక్స్‌బాక్స్ లైవ్, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సుమారు ముప్పై సంవత్సరాలు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ సీఈఓ పదవిని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా భారతదేశంలో పద్మ భూషణ్ అవార్డు కూడా దక్కించుకున్నారు.

(ఇదీ చదవండి: పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కార్ల ప్రపంచం.. ఓ లుక్కేసుకోండి!)

క్రికెట్ మీద ద్యాస ఉన్నప్పటికీ ప్రపంచంలోనే దిగ్గజ సంస్థకు సీఈఓగా ఎదిగేలా కృషి చేసారు సత్య నాదెళ్ల. భారతదేశంలో మధ్య తరగతి కుటుంబంలో పెరగడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. మొదటి సరి తాను కంప్యూటర్ ఉపయోగించిన సందర్భం ఇప్పటికీ మర్చిపోలేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top