breaking news
satya naadella
-
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సరికొత్త కంప్యూటర్లను ఆవిష్కరించింది. ఈ శక్తివంతమైన ఏఐ టూల్ గురించి సత్య నాదెళ్ల వివరిస్తున్న వీడియో బిలియనీర్ ఇలాన్ మస్క్ దృష్టిని ఆకర్శించింది.వీడియోలో సత్య నాదెళ్ల.. రీకాల్ ఫీచర్ అనే కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు చూసే, మీ కంప్యూటర్లో ప్రదర్శించే ప్రతి వివరాలను రికార్డ్ చేస్తుంది. డివైస్ నుంచి మీ మొత్తం హిస్టరీని సర్చ్ చేయడానికి, మళ్ళీ తిరిగి పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీగా పనిచేస్తుంది. మీ కంప్యూటర్లో మీరు చేసే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్క్రీన్షాట్లను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇది కేవలం కీవర్డ్ సర్చ్ కాదు, డాక్యుమెంట్ కాదు. గతంలోని క్షణాలను రీక్రియేట్ చేస్తుందని అన్నారు.ఈ వీడియో ఎక్స్ (ట్విటర్)లో భారీగా వైరల్ అయ్యింది. 24.3 మిలియన్లకంటే ఎక్కువ వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు.ఈ వీడియోపైన మస్క్ స్పందిస్తూ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బ్లాక్ మిర్రర్'ని ప్రస్తావిస్తూ, ఇది వ్యక్తుల జీవితాలపై దృష్టి పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తున్నాను అని కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మస్క్ మాత్రమే కాకుండా కొందరు నెటిజన్లు కూడా కొత్త ఫీచర్‌ను విమర్శించారు.బ్లాక్ మిర్రర్ సిరీస్బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. సమకాలీన సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి సాంకేతికత మరియు మీడియా థీమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది ఒక రకమైన ఊహాజనిత కల్పన. ఇది 2011 నుంచి 2013 వరకు ఆరు సిరీస్‌లలో 27 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2016, 17, 19, 23లలో నాలుగు సిరీస్‌లుగా ప్రసారం చేశారు. 2025లో ఏడో సిరీస్ విడుదలవుతుంది.This is a Black Mirror episode. Definitely turning this “feature” off. https://t.co/bx1KLqLf67— Elon Musk (@elonmusk) May 20, 2024 -
ఇది కదా సక్సెస్ అంటే! క్రికెట్ నుంచి సీఈఓ దాకా
ప్రపంచంలోని అగ్రగామీ దేశాల్లోని కంపెనీలలో భారత సంతతికి చెందిన ఎందోరో ఉన్నతమైన పదవులను అధిరోహించారు. అలాంటి వారిలో ఒకరు మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'. భారతదేశంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈయన గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. చిన్నపాటి నుంచే తన తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ, మద్దతు వంటివి సత్య నాదెళ్లలో ఆత్మవిశ్వాసం పెంచాయని, లింక్డ్ఇన్ సీఓఓ ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించే ది పాత్ అనే వీడియో సిరీస్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెల్లడించారు. పాఠశాల వయసులో చదువంటే బోరింగ్ అని, ఎప్పుడూ ద్యాసంతా క్రికెట్ మీదే ఉండేదని చెప్పుకొచ్చారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి సంస్కృతం ప్రొఫెసర్‌గా పనిచేశారని, ఈ రోజుకి కూడా తల్లిదండ్రులు నా వెనుక ఉండి భరోసా ఇస్తున్నారని గొప్పగా చెప్పారు. సత్య నాదెళ్ల ఇండియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆ తరువాత సన్ మైక్రోసిస్టమ్స్‌లో ఉద్యోగం ప్రారభించి బింగ్, ఎమ్ఎస్ ఆఫీస్, ఎక్స్‌బాక్స్ లైవ్, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సుమారు ముప్పై సంవత్సరాలు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ సీఈఓ పదవిని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా భారతదేశంలో పద్మ భూషణ్ అవార్డు కూడా దక్కించుకున్నారు. (ఇదీ చదవండి: పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కార్ల ప్రపంచం.. ఓ లుక్కేసుకోండి!) క్రికెట్ మీద ద్యాస ఉన్నప్పటికీ ప్రపంచంలోనే దిగ్గజ సంస్థకు సీఈఓగా ఎదిగేలా కృషి చేసారు సత్య నాదెళ్ల. భారతదేశంలో మధ్య తరగతి కుటుంబంలో పెరగడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. మొదటి సరి తాను కంప్యూటర్ ఉపయోగించిన సందర్భం ఇప్పటికీ మర్చిపోలేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. -
సత్యనాదెల్లా రాకతో..! నెంబర్ 1 స్థానం మైక్రోసాఫ్ట్ సొంతం..!
అనుకున్నట్లుగానే మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గల కంపెనీగా శుక్రవారం రోజున అవతరించింది. యాపిల్‌ను వెనక్కినెట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువలో నెంబర్ 1 స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సాధించింది. మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ విలువ 2.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ 2.489 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 2.476 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ రికార్డును క్రియోట్ చేసింది. మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ సంబంధింత సేవలు కరోనా సమయంలో బాగా కలిసి వచ్చాయి. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో మైక్రోసాఫ్ట్ స్టాక్ 1 శాతం పెరిగి, 327.50 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో యాపిల్ షేర్ విలువ సుమారు 4 శాతం మేర పడిపోయి, 146.41 డాలర్లకు చేరుకుంది. యాపిల్‌ను సెమీ కండక్టర్ల కొరత, సప్లై చైన్ రంగాలు దెబ్బతీశాయి. చదవండి: నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! సత్యనాదెల్లా రాకతో మైక్రోసాఫ్ట్ రయ్రయ్..! భారత సంతతికి చెందిన సత్యనాదెల్లా రాకతో మైక్రోసాఫ్ట్ రయ్రయ్ మంటూ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మార్కెట్ క్యాప్ విషయంలో మైక్రోసాఫ్ట్ నెంబర్ 1 స్థానం సాధించడంలో సత్య నాదెల్లా పాత్ర లేకపోలేదు. 2014 ఫిబ్రవరి 4 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో నియామకం జరిగినప్పటినుంచి సత్యనాదెల్లా కంపెనీలో పలు కీలక మార్పులను, ఇతర కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. నోకియా హ్యండ్‌సెట్ వ్యాపారంలో భాగంగా సుమారు 7 బిలియన్ డాలర్ల కొనుగోలును రద్దుచేశారు. ఈ మొత్తాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వ్యాపారాల్లో భారీ మొత్తంలో ఇన్సెస్ట్ చేసేలా నిర్ణయాలను తీసుకున్నారు. అంతేకాకుండా లింక్డ్ ఇన్, న్యూయాన్స్, గిట్‌హబ్ వంటి కంపెనీలను సముపార్జన చేయడంలో సత్య నాదెల్లా పాత్ర లేకపోలేదు. ఒక విధంగా సత్య నాదెల్లా తన కఠిన నిర్ణయాలతో మైక్రోసాఫ్ట్‌ను పూర్తిగా పునర్నిర్మించారు. యాపిల్ మళ్లీ వస్తోంది..! తాజాగా యాపిల్ మార్కెట్ క్యాప్ విలువ తగ్గిపోవడం కొద్ది రోజులపాటే ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. యాపిల్ తిరిగి ప్రపంచం నెంబర్ 1 మార్కెట్ క్యాప్ కంపెనీగా అవతరించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. వచ్చే మూడు సంవత్సరాల్లో యాపిల్ మార్కెట్ క్యాప్ విలువ మూడు ట్రిలియన్స్ కల్గి ఉన్న కంపెనీ అవతరించే అవకాశం ఉందని ఇంటరాక్టివ్ ఇన్వెస్టర్ నిపుణులు విక్టోరియా స్కాలర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: భారత్ దెబ్బ.. చైనాకు ఏకంగా 50వేల కోట్లు నష్టం -
అనూ కోసం అలా చేశా..
ఒర్లాండో : అమెరికా గ్రీన్ కార్డ్ కోసం అర్రులు చాచే టెక్నోక్రాట్లు చుట్టూ ఉంటే తాను అమితంగా ప్రేమించే భార్య కోసం గ్రీన్ కార్డును వదులుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల. తాను రాసిన ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. 1993లో సత్యా నాదెళ్ల అనూను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం భార్యను తనతో పాటు అమెరికా తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే అప్పుడున్న అమెరికన్ ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డ్ కలిగిన వారిని వివాహం చేసుకుంటే వారి భాగస్వామికి వీసా తిరస్కరిస్తారు. దీంతో సత్యాతో కలిసి ఆమె సీటెల్ రాలేకపోయారు. ఈ నిబంధన ఆయనలో సంఘర్షణ రేపడంతో వెనువెంటనే గ్రీన్ కార్డ్ వదులుకోవాలని నిర్ణయించారు. హెచ్1బీ వీసా కలిగి అమెరికాలో పనిచేస్తుంటే వారి భాగస్వాములు(భార్య లేదా భర్త) అమెరికా వచ్చేందుకు వెసులుబాటు ఉంది. ‘అప్పట్లో అనూయే నాకు ప్రాధాన్యం...అందుకే గ్రీన్ కార్డు వదిలి హెచ్1బి వీసాకు మొగ్గుచూపా’ నని తన అనుభవాలను పుస్తకంలో పొందుపరిచారు.తన నిర్ణయంపై అందరూ విస్తుపోయారని చెప్పారు. 1994లో ఢిల్లీలోని యూఎస్ ఎంబసీకి వెళ్లి గ్రీన్ కార్డును తిరిగి ఇచ్చేసి, హెచ్1బి వీసాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే అక్కడున్న క్లర్క్ ఆశ్చర్యపోయాడని గుర్తుచేసుకున్నారు. ఎందుకలా అనుకుంటున్నారని అతను అడగ్గా ఇమిగ్రేషన్ ఇబ్బందులను వివరించానని..దాంతో హెచ్1బీ ఫామ్‌ను తనకందించారని పుస్తకంలో పేర్కొన్నారు. హెచ్1బీ వీసా లభించడంతో తన భార్య తనతో కలిసి సీటెల్‌కు వచ్చిందని అక్కడ తాను జీవితాన్ని ప్రారంభించి..తామిద్దరం తమ జీవితం నిర్మించుకున్నామని వివరించారు. అప్పటి నుంచి నిత్యం తనను ఇమిగ్రేషన్ సలహాల కోసం ఎవరో ఒకరు సంప్రదిస్తూ ఉండేవారని చెప్పారు. -
విలువల రాపిడితోనే ఈ వజ్రకాంతి
సమకాలీనం: అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపుణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయవంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సాహానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల పగ్గాలు ఒకటొకటిగా భారతీయ మేధోనా యకుల చేతుల్లోకి రావడం ఇప్పుడు అంతటా ఓ ముచ్చటయింది. ముఖ్యంగా మొన్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), నిన్న సుందర్ పిచయ్ (గూగుల్) సీఈవోలయ్యాక ఈ చర్చ పెరిగింది. డజన్ వరకు ప్రథమశ్రేణి వివిధ గ్లోబల్ సంస్థలకు భారతీయులు ఈ రోజున సీఈఓలుగా ఉన్నారు. ఇక కింద, వివిధ స్థాయిల్లోకి ఎదిగి-ఒదిగిన వారిది పెద్ద లెక్కే ఉంది. ఇదేలా సాధ్యమైంది...? అన్నపుడు, సాక్షి జర్నలిజం విద్యార్థులు తమకు తోచిన కారణాలు చెబుతూ వచ్చారు. కొందరు ఇది కష్టపడే తత్వం వల్ల అని, నిబద్ధత కారణంగా అని, అంకితభావమని, ఎదగాలనే తపన ఉండడమని, భిన్నంగా-వినూత్నంగా ఆలోచించడం వల్లేనని, మధ్య తర గతి నేపథ్యం కావడంతో అని... ఇలా డజన్‌కు పైగా వేర్వేరు కారణాలు చెప్పారు. ఎక్కడో ఓ మూల నుంచి సన్నని స్వరం 'తల్లిదండ్రుల వల్ల' అన్న మాట వినిపించింది. నిజమే! భారత సమాజంలో తమ పిల్లల ఎదు గుదలకు తల్లిదండ్రులు చేసే కృషి, జరిపే త్యాగాలు అసమానమైనవి. అందరూ తమ పిల్లల్ని వివిధ కంపెనీలకు సీఈవోల్ని చేయలేక పోవచ్చు. కానీ, తామున్న పరిస్థితి కన్నా మెరుగైన స్థితిలో పిల్లలుండాలనే తపన లేని తల్లిదండ్రులు మన దేశంలో ఉండరేమో! కేవలం ఆలోచనా పరమైన తపన మాత్రమే కాక అందుకోసం అత్యధికులు చిత్తశుద్ధితో కృషి చేస్తారు. ఆరుగాలం శ్రమిస్తారు. ఈ క్రమంలో... తమకున్నా, లేకున్నా పిల్లల్ని వృద్ధిలోకి తేవాలనే బలమైన భావన వారిని ముందుకు నడుపుతుంది. చిన్న చిన్న సౌఖ్యాలు, ముచ్చట్లు, అవసరాలు.... అన్నీ వదులుకొని కూడా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకీ దేశంలో కొదవలేదు. 'అంతా పిల్లల కోసం కరిగేస్తే... మరి, రేపేంటి?' అన్న చిన్న సందేహం, ఆలోచనక్కూడా తావివ్వకుండా, సర్వస్వం వారి చదువుల కోసం, ఉన్నతి కోసం హారతి కర్పూరంలా కరిగించే తల్లిదండ్రులెందరో! ఇది అంతో ఇంతో ఉన్న వాళ్ల పరిస్థితి. ఇక ఏమీ లేని నిరుపేదలు, దిన కూలీలు, పెద్దగా రాబడిలేని అల్పాదాయ వర్గాల వారు కూడా తమ స్తోమతకు మించి డబ్బును పిల్లల కోసం వెచ్చిస్తారు. ఖర్చు అనివార్యమైనపుడు కూడా వెనుకాడరు. కష్ట మైతే తమ అవసరాల విషయంలో రాజీపడతారు, లేకపోయినా సరేనని సరిపెట్టుకుంటారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతటి తల్లిదండ్రుల త్యాగాలు ఉండవేమో అనిపిస్తుంది. ఒక వైపు విలువల సమాజం, మరో వైపు తల్లిదండ్రుల ప్రోత్సాహం భారత యువతరాన్ని ఎదుగుదల వైపు పరుగులు తీయిస్తోంది. ఇది ఇవాళ్టిది కాదు... పిల్లలే తమ సర్వస్వం అనే తల్లిదండ్రుల భావన ఇవాళ్టిది కాదు. భార తీయ జీవన విధానంలోనే ఉంది. మహాభారతంలో మంచి పేరున్న పాండురాజు, కుంతి మాత్రమే కాదు, స్వార్థపరులని కాసింత చెడ్డపేరున్న ధృతరాష్ట్ర-గాంధారీలు కూడా తమ పిల్లల ఉన్నతి కోసం తపించిన వారే! వీర శివాజీని మరాఠా యోధునిగా తీర్చిదిద్దిన జిజియాబాయి, గాంధీజీని జాతిపితగా మలచిన పుత్లీబాయి... ఇలా ఎందరెందరో! పితృవాక్య పాలన అని శ్రీరాముడు అడవులకెళితే తట్టుకోలేక చనిపోయిన తండ్రి దశరథుని పుత్రప్రేమ కంటే, జనవాక్యపాలన అని తనను రాముడే అడవు లకంపినా.... కుశ, లవుల్ని కని-పెంచి, విద్యాబుద్ధులతో తీర్చిదిద్దిన సీత పుత్ర వాత్సల్యమే గొప్పది. అది మన వారసత్వ సంపదయింది. పిల్లల చదువుల కోసం, ఇవాళ్టికీ వేలాది మంది తల్లులు స్వచ్ఛంద సాంసారిక వియోగాన్ని భరిస్తున్న సీతలు. ఉపాధి, జరుగుబాటు కోసం భర్తలెక్కడో ఊళ్లల్లో వ్యవసాయమో, పట్టణాల్లో వ్యాపారమో చేస్తుంటే... నగరాలు, మహా నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటూ పిల్లల్ని చదివిస్తుంటారు తల్లులు. అహర్నిశలు వారి బాగోగుల ఆలోచనలే! అక్కడ తండ్రులదీ అదే బలవం తపు ఒంటరి బతుకు. కష్టపడుతూ పిల్లల చదువుల కోసం డబ్బులు పం పిస్తూ ఉంటారు. అది హైదరాబాద్‌లో విద్యానగర్, అమీర్‌పేట, కూకట్ పల్లి కావచ్చు; గుంటూరు, విజయవాడలలో వేరేవేవో బస్తీలు కావచ్చు, ఇంకే ఇతర జిల్లా కేంద్రాలో, ముఖ్య పట్టణాలో కూడా కావచ్చు, విషయ మొకటే! అంటే, పిల్లల చదువుకోసమే... సొంత ఇంటిని-ఊరునీ వీడి, అష్టకష్టాలు పడీ, ఆస్తులు అమ్ముకునీ, తీర్చలేని ప్రయివేటు అప్పులు చేసీ, బ్యాంకుల్లో విద్యారుణాలు పొందీ పీకల్లోతుగా రుణగ్రస్తులవుతుం టారు. వాటిని తీర్చేక్రమంలో... సరళ జీవితాల్ని సంక్లిష్టం చేసుకునే కుటుంబాలెన్నో! భారత యువతకు సలామ్! అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్ప డింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపు ణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయ వంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సా హానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ఇంకేం! ప్రపంచం, ముఖ్యంగా ఐటీ ప్రపంచం మనవాళ్ల పాదాక్రాంతమైంది. అజీం ప్రేమ్‌జీ, నారాయణమూర్తి, శివనాడార్, రామలింగరాజు, నందన్ నీలేకనీ వంటి తొలితరం నేతలు వేసిన బీజాలు మంచి భూమికనేర్పాటు చేశాయి. ఈ దేశానికి చెందిన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ముఖ్య విద్యా సంస్థల కృషి తల్లిదండ్రుల త్యాగాలకు తోడయి ఆడా మగ తేడా లేకుండా యువత సాఫ్ట్వేర్ గుర్రమెక్కింది. ఐటీ ప్రపంచ పథాన ఇప్పుడు దౌడు జోరందు కుంది. బ్రెయిన్ డ్రెయిన్ అని మొదట్లో కొందరు ఆందోళన చెందినా, అది సరైన ఆలోచన కాదని తేలిపోయింది. పోటీ యుగంలో... వీలయినన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, సమస్త ప్రపంచాన్ని దున్నేయడం. వీలైతే వెనక్కివచ్చి స్వదేశాన్నీ శక్తిమంతం చేయడంలో చేదోడు వాదోడు గానిలవడం, ఇదే ఇప్పుడు జరగాల్సింది. తొలితరం విదేశాలకి వెళ్లి విజ యవంతమైన కొంతమంది ఈ పని చేస్తున్నారు. ఇక్కడి పరిపాలన, రాజకీయ వాతావరణంలో కూడా మార్పు రావాలి. ప్రపంచానికి నేర్పిన విలు వల్ని మన వాళ్లే మరచిపోతున్నారు. మన పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 'విలువలతో కూడిన జీవన శైలి... భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక'ని కితా బిచ్చారు. ఆ విలువల జీవనశైలి, తల్లిదండ్రుల త్యాగాలు, సుదీర్ఘంగా సాగే కృతజ్ఞతా భావమే మన యువతరాన్ని విశ్వవేదికపై నాయకత్వ స్థానాల్లోకి తీసుకువస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య సమా చార కమిషనర్‌గా పనిచేసి రిటైరయిన సి.డి.అర్హ డెబ్బై ఏళ్ల వయసులో ఇప్పుడు 'ఇండస్'అనే ఓ పెద్ద విద్యాపీఠం ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నత చదువులతో విశ్వ నిపుణులుగా ఎదిగి అత్యున్నత హోదాల్లో ఉన్నారు. ఆరున్నర దశాబ్దాల కింద, అర్హ తండ్రి రెవెన్యూ ఉద్యోగిగా తనకొచ్చే నెల జీతం 75 రూపా యల్లో 55 రూపాయల నెలసరి ఫీజు కట్టి సెయింట్ జేవియర్ అనే గొప్ప పాఠశాలలో కొడుకును చదివించారు. మిగతా కుటుంబ పోషణకు నెలకు 20 రూపాయలే వెచ్చించారు. ఇలాంటి ఏ తల్లిదండ్రుల త్యాగాలూ వృథా పోకూడదు. తీసుకున్న చోట... తిరిగి ఇచ్చేయాలి! పిల్లలెంత ఎత్తు ఎదిగినా కన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు. కొంత డబ్బు వెచ్చించి ‘వృద్ధాశ్రమాల్లో వేశాం కదా! ఇంకేంటి’ అనేపాటి కృతజ్ఞత చాలదు. వారి త్యాగాల క్రమంలో మరుగున పడ్డ నెరవేరని కలల సాకారా నికి సహకరించాలి. మాతృదేశాన్నీ విస్మరించొద్దు. ఏపీజే అబ్దుల్‌కలాం తన స్వీయకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో తన తల్లి సంస్కారాన్ని స్మరిస్తూ రాసుకున్న కథలు ఒక్క కలాం కథలు మాత్రమే కావు. కుటుంబం పేదరి కం అనుభవిస్తుంటుంది. తల్లి రాత్రివేళ రొట్టెలు కాల్చి చదువుకునే పిల్ల లకు పెడుతుంది. తండ్రికి మాడిపోయిన రొట్టె దొరుకుతుంది. చిన్న పిల్లాడైన కలాం ఈ సన్నివేశాన్నంతా చూస్తుంటాడు. కుటుంబ సంబంధాల మధ్య, సభ్యుల మధ్య కోపతాపాలూ, సహజ భావావేశాలను ప్రేమ ఎలా అధిగమిస్తుందో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. మాడిపోయిన రొట్టెను కంచంలో పెట్టుకున్న నాన్నను అడుగుతాడు. 'మాకందరికీ మం చి రొట్టెలు వేసి, చివర్లో నీకు మాడిపోయిన రొట్టెను పెట్టినందుకు నీకు అమ్మపై కోపంగా లేదా?'అని. అందుకా తండ్రి ప్రేమతో 'పొద్దుట్నుం చీ ఆమె పని చేస్తూనే ఉంది. పైగా మాడిపోయిందేదో నాకు పెట్టింది. కానీ ఆమె ఇంకా తినలేదు చూశావా?'అంటాడు. దాంతో మళ్లీ తల్లి దగ్గరకు వెళ్లి 'అమ్మా నువ్వు ఇంకా తినలేదు. మాకు మాత్రమే పెట్టావు. నువ్వూ తినమ్మా'అంటాడు కలాం. దానికా తల్లి చిర్నవ్వుతో. 'నాన్నా... నువ్వు 'చదువుకునే' పిల్లాడివి. నీకు చదువుకునేందుకు శక్తి కావాలి. నీకు చదువు కునేందుకు మేధస్సు పెరగాలి. అందుకే నీకీ రొట్టెలు. తిని బాగా చదు వుకో' అని స్పందిస్తుంది. అంతే... ఈ కష్టాలన్నీ ఎరిగిన కలాం బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత తన తల్లి గురించి మాట్లాడుతూ భావో ద్వేగంతో రాసుకున్న మాటలు అందరినీ కదిలిస్తాయి. 'ఆరోజున నాకు నువ్వు పెట్టిన రొట్టెలతో పెరిగిన మెదడు మేధస్సూ, తనువు తేజస్సూ ఇవ్వాళ్ల నాతోనే ఉన్నాయి. కానీ నాకోసం నువ్వు చేసిన త్యాగం నాకు గుర్తుంది. ఇవ్వాళ నీకు పాదాభివందనం చేద్దామంటే నువ్వు లేవు. అలాగే నేను కూడా లేని స్థితి ఒకటి వస్తుంది. నువ్వు ఈ లోకాన్ని వీడిపోయిన రోజున ఏ దివ్య శరీరాన్ని ధరించావో, నేనూ ఈ లోకాన్ని వీడిన రోజున అదే దివ్య శరీరాన్ని ధరిస్తా. నువ్వు చేరిన లోకాలకే నేనూ చేరుతా. నా రొట్టెల కృతజ్ఞత తీర్చేందుకు నువ్వే రూపంలో ఉన్నావో, అదే రూపంలో నేనూ నీ దగ్గరకు చేరి నీ పాదాలను... నువ్వు పెట్టిన రొట్టె తిన్న ఈ చేతులతో స్పర్శిస్తా' అని రాసుకున్నాడు. కలాం ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగినందున్నే ఈ చరిత్రను మనం తెలుసుకోగలిగాం. కానీ ఇలాంటి దివ్యానుభవాలు చవిచూసే కుటుంబాలు మన సమాజంలో, మనకు తెలియకుండా.... ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ఉంటాయేమో! తీసుకున్న చోటే ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఆర్. దిలీప్ రెడ్డి సాక్షి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com