మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య.. స్పందించిన కంపెనీ | Microsoft Azure Globally Down | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య.. స్పందించిన కంపెనీ

Jul 30 2024 9:19 PM | Updated on Jul 30 2024 9:25 PM

Microsoft Azure Globally Down

మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు అనేక సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి ఇంజినీరింగ్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అజ్యూర్ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కూడా పేర్కొంది.

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య మొదట యూరోప్‌లో గుర్తించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు చాలామందే ఉన్నారని పలువురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement