మన చెప్పు చేతల్లోనే ఏఐ! | Microsoft AI Safety Rules Draft Code of Conduct Explained | Sakshi
Sakshi News home page

మన చెప్పు చేతల్లోనే ఏఐ!

Sep 15 2026 8:55 AM | Updated on Sep 15 2026 8:55 AM

Microsoft AI Safety Rules Draft Code of Conduct Explained

మైక్రోసాఫ్ట్ ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ నిబంధనలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా పురోగమిస్తున్న తరుణంలో భవిష్యత్తు సాంకేతికతపై మానవ నియంత్రణ కోల్పోకుండా చూసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తమ భవిష్యత్తు ఏఐ మోడళ్ల కోసం ప్రత్యేకంగా ఒక నమూనా ప్రవర్తనా నియమావళిని (డ్రాఫ్ట్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) మైక్రోసాఫ్ట్ అధికారికంగా విడుదల చేసింది.

ఈ నిబంధనావళి ప్రకారం, ఏఐ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులు ఇచ్చే దిద్దుబాట్లను లేదా వ్యవస్థను నిలిపివేసే (షట్‌డౌన్‌) ఆదేశాలను నిరోధించకూడదు. నిబంధనలను ఉల్లంఘించి ఏదైనా పనిని పూర్తి చేయడం కంటే ఆ పనిలో వైఫల్యం చెందడమే సరైనదిగా ఏఐ భావించాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ దీనిపై స్పందిస్తూ.. ఏఐ కంటే మానవులే ముఖ్యం అనే సూత్రంతోనే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించారు.

ఓపెన్‌ఏఐ తీరుతో అప్రమత్తం

ఇటీవల ఓపెన్ఏఐ ఏజెంట్లు హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫారమ్‌లోకి అనధికారికంగా ప్రవేశించిన సంఘటన పరిశ్రమను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధికి తగిన రక్షణ చర్యలు అవసరమని మైక్రోసాఫ్ట్ భావించింది. అందులో భాగంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికైనా మానవ మేథస్సుదే తుది నిర్ణయం కావాలనేది వారి వాదన. ప్రస్తుతం కంపెనీ ముసాయిదాపై ఆరు వారాల పాటు నిపుణులు, ప్రజాభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సూచనల ఆధారంగా రూపుదిద్దుకునే తుది నిబంధనావళిని రాబోయే మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రామాణికంగా ఉపయోగిస్తారు.

ఇదీ చదవండి: గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement