18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్‌మెంట్‌

Meet Hayden Bowles 17years dropout now Retired Millionaire At 22 - Sakshi

17 ఏళ్ల వయసులోనే  చదువుకు గుడ్‌బై చెప్పాడు. అయితేనేం కేవలం 19 ఏళ్లకే లక్షాధికారిగా మారిపోయాడు. టిక్‌టాక్,  యూట్యూబ్‌ వీడియో ద్వారా ఏంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు హెడెన్‌ బౌల్స్‌. లంబోర్ఘినీ కారు, టెక్నికల్‌ రిటైర్‌ మెంట్‌.. లగ్జరీ టూర్లు.. అటు లక్షల మంది ఫాలోయర్లు.. ఇటు లక్షలాది సబ్‌స్క్రైబర్లు.. ఇదంతా ఎలా సాధ్యం.. తెలుసుకోవాని ఉందా? అయితే ఈ స్టోరీలోకి పోదాం రండి!

అమెరికాకు చెందిన హెడెన్ బౌల్స్ చిన్నవయసులోనే ఇ-కామర్స్పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి చదువుకు స్వస్తి పలికాడు. ఈకామ్‌సీజన్‌ (EcommSeason) అనే ప్లాట్‌పారమ్‌తో వ్యాపారవేత్తగా అవతరించాడు. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా అనే కోర్సులను అందిస్తుంది. ఇది దీనికి చార్జ్‌ 575 డాలర్లు అంటే సుమారు 47 వేల రూపాయలు. కేవలం రెండేళ్లలోనే తన కలను సాకారం చేసుకున్నాడు. 22 ఏళ్లకే మిలియన్ల డాలర్లను ఆర్జిస్తున్నాడు. అంతేకాదు దీనిద్వారా వచ్చిన సొమ్మును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టి హాయిగా జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. బౌల్స్ 18 ఏళ్ల వయస్సులోనే విలాసవంతమైన లంబోర్ఘినిని సొంతం చేసుకోవడం విశేషం. 

తన విజయానికి గల కారణాలను టిక్‌టిక్‌ యూట్యూబ్‌ వీడియోల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. దీంతో అతనికి మరింత ఆదరణ పెరిగింది. టిక్‌టాక్‌లో దాదాపు 107,000మంది అనుచరులు, యూట్యూబ్‌లో 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.  ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. గత సంవత్సరం కేవలం ఇ-కామర్స్ నుండి 15 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాడు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా మరో 1.5 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు. 

ఇంకా పని చేయాలని ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడుల లాభాలతో తాను "టెక్నికల్‌ రిటైర్డ్"గా భావిస్తున్నానని పేర్కొన్నాడు.  ఈ వెంచర్ల నుండి వచ్చే ఆదాయం  చాలు జీవితాంతం హ్యాపీగా  ఉంటా అంటున్నాడు. అందుకే ఇపుడు బాలి తదితర పలు టూరిస్ట్‌ ప్లేస్‌లను సందర్శిస్తూ లగ్జరీగా లైఫ్‌ను గడిపేస్తున్నాడు. పర్యటనల ఫుటేజ్‌తో, ఫోటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతూ తన సక్సెస్‌ సీక్రెట్లను ఫాలోయర్లతో పంచుకుంటున్నాడు. 

అంతేకాదు జీవితంలో పైకి రావాలని భావిస్తున్న వారికి కీలక సలహాలు కూడా అందిస్తున్నాడు. మీరు సోషల్‌మీడియా స్టార్‌ కావాలనుకుంటే.. ఏం చేయాలో ఆలోచించుకుని ముందుకు సాగాలని సలహా ఇస్తాడు. 

డెడికేషన్‌, సింగిల్‌ ఫోకస్‌...
సంపద అంటే.. రాబడి, ఖర్చుల నిష్పత్తి అంటాడు  బౌల్స్. అంతేకాదు విజయవంతమైన వ్యక్తులు వారు సంపాదించిన దానిలో 20 శాతం మాత్రమే ఖర్చుపెడతారని మీరు కూడా  అలా చేయగలిగితే, ఆ పొదుపును పెట్టుబడిగా పెట్టి రెట్టింపు ఆదాయాన్ని సాధించవచ్చు అంటాడు. ఫోకస్‌  ఎపుడూ సింగిల్‌ గానే ఉండాల, ప్రస్తుతం చేస్తున్న బిజినెస్‌ డెడికేషన్‌ ఉండాలని  పిలుపునిస్తున్నాడు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top