CoronaVirus: కోవిడ్‌ భయపెట్టినా.. పాఠాలు నేర్వని హైదరాబాదీలు

Max Life Insurance Survey About financial protection Amid Corona Crisis - Sakshi

Max Life Insurance Survey: గడిచిన వందేళ్లలో యుద్ధాలను, ప్రకృతి వైపరిత్యాలను మినహాయిస్తే మానవాళిని అత్యంత భయాందోళనకు గురి చేసింది కరోనా వైరస్‌. ముఖ్యంగా మొదటి రెండు వేవ్‌లలో కరోనా బారిన పడి.. చికిత్స కోసం చేసిన ఖర్చులతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయాయి. చాలా మంది అప్పులపాలై ఆస్తులు అమ్మేసుకున్నారు. ఇప్పుడిప్పుడే దేశం కరోనా నుంచి కోలుకుంటోంది. అయితే కరోనా తీవ్రంగా భయపెట్టినా ఆరోగ్య భద్రత, ఆర్థిక స్థిరత్వం కోణంలో  హెల్త్‌ ఇన్సురెన్సు చేయించడంలో హైదరాబాదీలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. 

కోవిడ్‌ అనంతరం హెల్త్‌ ఇన్సురెన్స్‌ విషయంలో భారతీయు ఆలోచణ ధోరని ఎలా ఉందో తెలుసుకునేందుకు మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ సంస్థ ఇటీవల దేశంలో ఉన్న 22 నగరాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం 5729 శాంపిల్స్‌ సేకరించి ఈ నివేదిక రూపొందించారు. దేశంలో ఒమిక్రాన్‌ వైరష్‌ విజృంభించిన సమయంలో అంటే 2021 డిసెంబరు నుంచి 2022 జనవరి మధ్యన ఈ శాంపిల్స్‌ సేకరించారు.

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పరిశీలిస్తే ఫైనాన్షియల్‌ ప్రొటెక‌్షన్‌ కోషెంట్‌కి సంబంధించి దేశ సగటు 53 పాయింట్లుగా ఉంది. ఇక ప్రధాన మెట్రో నగరాలను పరిశీలిస్తే ముంబై 55, కోల్‌కతా, చెన్నై 52 స్థానాల్లో నిలిచాయి. 48 పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ మెట్రో నగరాల్లో అన్నింటికంటే దిగువన నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేనేళ్లుగా ప్రభుత్వతమే ఆరోగ్యశ్రీ పేరుతో సామాజిక హెల్త్‌ ఇన్సురెన్స్‌ స్కీం అమలు చేయడం వల్ల ఇక్కడ కొంత మేర ప్రైవేట్‌ ఇన్సురెన్స్‌ తగ్గి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top