రెండేళ్లలో రెండు లక్షల సేల్స్!.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్ | Maruti Grand Vitara Sales Cross 2 Lakh Units | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో రెండు లక్షల సేల్స్!.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్

Jul 21 2024 9:10 PM | Updated on Jul 21 2024 9:16 PM

Maruti Grand Vitara Sales Cross 2 Lakh Units

2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.

మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది. మొత్తం మీద గత జూన్ చివరి నాటికి మొత్తం 1,99,550 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది.

కేవలం 12 నెలల కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన గ్రాండ్ విటారా.. ఆ తరువాత కూడా అధిక అమ్మకాలను పొందగలిగింది. దీంతో కేవలం 10 నెలల కాలంలోనే మరో లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. గ్రాండ్ విటారా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement