
వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పోర్ట్‌ఫోలియోలో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన రెవ్‌ఎక్స్ సిరీస్‌ను తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ఆవిష్కరించింది. బుకింగ్స్‌తో పాటు డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు సంస్థ సేల్స్ విభాగం జోనల్ హెడ్ (సౌత్) అరుణాంగ్షు రాయ్ ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఇదీ చదవండి: వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డు
ఇందులో రెవ్‌ఎక్స్ ఎం, ఎం(ఓ), ఏ అని మూడు వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ధర రూ.8.94 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రీమియం లెదరెట్ సీట్లు, సన్‌రూఫ్, బిల్ట్‌ఇన్ అలెక్సా, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, తదితర ఫీచర్లు ఉంటాయని రాయ్ చెప్పారు. గతేడాది ఆవిష్కరించిన 3ఎక్స్‌వో కేవలం 11 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10,000 పైచిలుకు యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొన్నారు.