Anand Mahindra Group Chairman Reacted to Mahindra Bolero SUV’s Water-Wading Potentiality in Flooded - Sakshi
Sakshi News home page

Viral Video: ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ!

Sep 14 2021 3:37 PM | Updated on Sep 14 2021 5:26 PM

Mahindra CEO Stunned After Watching This Video - Sakshi

ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇటీవల గుజరాత్‌ణు ముంచెత్తిన వర్షాలు, వరదల సమయంలో తీసిన ఓ వీడియో చూసి ఆయన ఆశ్చర్యపోయారు. 

వైరల్‌ వీడియో
గుజరాత్‌లో కురిసన భారీ వర్షాలకు ఆ రాష్ట్రానికి చెందిన రాజ్‌కోట్‌ సిటీ వరద నీటితో మునిగిపోయింది. ఊరా లేదా చెరువా అన్నట్టుగా అంతా నీటిమయం అయ్యింది. ఆ సమయంలో ఓ మహీంద్రా వాహానంలో పోలీసులు రెస్క్యూ కోసం వెళ్తున్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియో చూసిన ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యపోయారు.  సీరియస్‌లీ ? డూరింద్‌ ది రీసెంట్‌ రైన్స్‌ ? ఈవెన్‌ ఐమ్‌ ప్రెట్టీ అమేజ్డ్‌ అంటూ క్యాప్షన్‌ జోడించారు.
భిన్న స్వరాలు
ఆనంద్‌ మహీంద్రా కామెంట్‌ చేయడంతో  నెటిజన్లు ఈ పోస్టుపై తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహీంద్రా వాహనాలు నమ్మకానికి మరో పేరు అంటుండగా మరికొందరు బ్రాండ్‌ ప్రమోషన్‌ బాగా చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కాగా బ్రాండ్‌, వాహనం అన్నది ప్రధానం కాదని, అంత వరదలోనూ డ్యూటీ నిర్వర్తిస్తున్న పోలీసులను మెచ్చుకోవాలంటూ సూచిస్తున్నారు.

చదవండి : Horror Offer: పది రోజుల్లో పదమూడు సినిమాలు! హే.. రెప్పవేయొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement