Horror Offer: పది రోజుల్లో పదమూడు సినిమాలు! హే.. రెప్పవేయొద్దు

American Finance Company Offers Money To Watch 13 Horror Movies - Sakshi

Horror Movies Challange: నయనతార నటించిన మయూరి(మాయా) సినిమా గుర్తుందా?. తాను తీసిన హర్రర్‌ సినిమాను ఒంటరిగా, భయపడకుండా చూస్తే.. నగదు బహుమతి ఇస్తానంటూ అందులో డైరెక్టర్‌ క్యారెక్టర్‌ ఓ ప్రకటన ఇస్తుంది. అంతేకాదు సినిమా చూస్తున్నంత సేపు హార్ట్‌-పల్స్‌బీట్‌ను పరిశీలిస్తుంటారు కూడా. దాదాపు లక్ష రూపాయల ప్రైజ్‌ మనీతో అలాంటి ప్రకటననే జారీ చేసింది ఓ కంపెనీ. కాకపోతే అది మనదేశంలో కాదులేండి. 

హర్రర్‌ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉంటారో.. దానిని చూడడానికి అంతే కష్టపడేవాళ్లు అంతేమంది ఉంటారు. కానీ, అమెరికాలో ఓ కంపెనీ..  హర్రర్‌ సినిమాల్ని చూసేవాళ్లకు లక్ష దాకా ప్రైజ్‌ మనీ ఇస్తుందట.  అమెరికాలోని ఫైనాన్స్‌బజ్‌ అనే ఫైనాన్స్‌ కంపెనీ ఈ నొటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది. అక్టోబర్‌ నెలలో వాళ్లు ఎంపిక చేసిన పదమూడు హాలీవుడ్‌ హర్రర్‌ సినిమాల్ని పదిరోజుల్లో చూసేయాలి. అదీ రేప్పేయకుండా.. భయంతో వణికిపోకుండా!. చాలెంజ్‌లో గెలిస్తే 1,300 డాలర్లకిపైగా(దాదాపు లక్ష దాకా) ప్రైజ్‌మనీ ఇస్తారు.  అయితే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే కండిషన్‌ పెట్టారు.
 
త్వరలో హాలీవుడ్‌లో కొన్ని హర్రర్‌ సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. ఈ తరుణంలో హైబడ్జెట్‌.. లోబడ్జెట్‌ హర్రర్‌ సినిమాల్లో ఏవి ఎక్కువగా భయపెడతాయి అనేది తెలుసుకునేందుకు ఫైనాన్స్‌బజ్‌ ఈ ప్రయత్నాన్ని చేస్తోంది.  లిస్ట్‌లో ‘సా, ఎమిటీవిల్లే హర్రర్‌, ఏ క్వైట్‌ ప్లేస్‌, ఏ క్వైట్‌ ప్లేస్‌-2, క్యాండీమ్యాన్‌, ఇన్‌సైడియస్‌, ది బ్లెయిర్‌ విచ్‌ ప్రాజెక్ట్‌, సిన్‌స్టర్‌, గెట్‌ అవుట్‌, ది పర్గే, హలోవీన్‌(2018), పారానార్మల్‌ యాక్టివిటీ, అన్నాబెల్లె’ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ 26 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు.
 

ఇక ఒంటరిగా ఈ సినిమాలు చూస్తున్నంత సేపు ఫిట్‌బిట్‌ సాయంతో హార్ట్‌, పల్స్‌ రేట్‌ను మానిటర్‌ చేయబోతున్నారు. ఏమైనా తేడాలు అనిపిస్తే.. ఆ వ్యక్తిని సినిమా చూడడం ఆపేయమని డిస్‌క్వాలిఫై చేస్తారు. ఇక ఈ ఫిట్‌బిట్‌ను ఫైనాన్స్‌బజ్‌ కంపెనీ వాళ్లే అందిస్తారు. అంతేకాదు సినిమాలు చూడడానికి 50 డాలర్ల రెంటల్‌ డబ్బును కూడా చెల్లిస్తున్నారు. ఇంతకీ ఈ ఉద్యోగానికి పెట్టిన పేరేంటో తెలుసా.. ‘హర్రర్‌ మూవీ హార్ట్‌ రేట్‌ అనలిస్ట్‌’.

చదవండి: మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top