breaking news
Horror movies
-
హారర్ ర్ర్ర్ర్ర్ భయం భయం
తెలుగు పరిశ్రమలో హారర్ ట్రెండ్ నడుస్తోందా? అనేలా ప్రస్తుతం ఆ జానర్ సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. జనరల్‌గా స్టార్ హీరోలు ఈ జానర్ చిత్రాల్లో కనిపించడం తక్కువ. అయితే ప్రభాస్లాంటిపాన్ ఇండియా స్టార్ కూడా ఈ తరహా సినిమాలో నటించడం ఓ విశేషం. ఇక... హారర్ జానర్లో రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం. భయపెట్టే రాజాసాబ్ వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో యమా జోరుగా దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. తన కెరీర్లో ఇప్పటివరకూ లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా నటించారాయన. అంతేకాదు... పలు సినిమాల్లో తనదైన శైలిలో భావోద్వేగాలు, వినోదం పంచిన ఆయన తొలిసారి ‘రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని హారర్ జానర్ కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ‘రాజా సాబ్‘ సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మారుతి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ నెల 16న ‘రాజా సాబ్’ టీజర్ విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే విడుదల పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్. హారర్ కనకరాజు హీరో వరుణ్ తేజ్ తొలిసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్స్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్ హారర్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ హారర్ కామెడీ చిత్రంలో మొదటి సారి ఆడియన్స్‌ని భయపెట్టనున్నారు వరుణ్ తేజ్.ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్, ద్వితీయ షెడ్యూల్‌ను అనంతపురంలో జరిపారు మేకర్స్. అనంతపురం పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వరుణ్ తేజ్, రితికా నాయక్‌పై పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయట. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో తనదైన శైలిలో వినోదాన్ని జోడించారట మేర్లపాక గాంధీ. హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో వరుణ్ తేజ్ పాల్గొనగా ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారట. ఈ సాంగ్‌లో ఆయన సరసన దక్షా నగార్కర్ స్టెప్స్ వేశారని టాక్. తర్వాతి షెడ్యూల్ కొరియాలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘కొరియన్స్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. రైల్వే కాలనీలో దెయ్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘అల్లరి’ నరేశ్ ఈ మధ్య సీరియస్ కథలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఆడియన్స్‌ని భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘12 ఏ రైల్వే కాలనీ’. ‘మా ఊరి ΄పొలిమేర, మా ఊరి ΄పొలిమేర 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ ‘12 ఏ రైల్వే కాలనీ’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, సాయికుమార్ కీలక పాత్రలుపోషిస్తున్నారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ‘ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి రా.. అందరికీ ఎందుకు కనిపించవు’ అనే డైలాగ్స్‌తో మొదలైన ఈ టీజర్ ఉత్కంఠగా సాగింది. ప్రాణాలతో బయటకుపోవుడు అవసరం లేదన్న...!’ అంటూ టీజర్ చివర్లో నరేశ్ చెప్పే డైలాగులు ఆక ట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తి పాత్రలో నరేశ్ కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కిష్కింధపురిలో... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. ‘రాక్షసుడు’ వంటి చిత్రం తర్వాత హీరో శ్రీనివాస్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్స్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ఇది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ డైరెక్టర్ కౌషిక్ పెగల్లపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.ఈ సినిమా పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ఉంటుందట. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి దశకు చేరుకుందని టాక్. ‘భైరవం’ ప్రమోషన్స్‌లో ఉన్న సాయి శ్రీనివాస్ ఆ తర్వాత ‘కిష్కింధ పురి’ చిత్రీకరణలో జాయిన్ కానున్నారట. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమాని విడుదల చేయనున్నారట మేకర్స్. ఏ మిస్టిక్ వరల్డ్ ఆది సాయికుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో భౌగోళిక శాస్త్రవేత్త పాత్రలో ఆది కనిపించనున్నారు. ండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్‌తో, కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాలతో ప్రేక్షకులన్ని సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. అదే విధంగా ఈ చిత్రంలోని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ΄పొలిమేరలో ట్విస్టులు ‘సత్యం’ రాజేశ్ ప్రధాన పాత్రలో హారర్, చేతబడి నేపథ్యంలో రూపొందిన ‘మా ఊరి ΄పొలిమేర’ (2021), ‘మా ఊరి ΄పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్‌గా నిలిచాయి. దీంతో ‘΄పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.వంశీ నందిపాటి ఎంటర్టైన్స్ మెంట్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ సినిమా రూపొందిస్తున్నారు. తొలి, మలి భాగాల్లానే హారర్, చేతబడి అంశాలతో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పైగా తొలి రెండు భాగాలతోపోలిస్తే ‘΄పొలిమేర 3’లో ప్రేక్షకులకు ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ మధ్య విడుదలైన ‘΄పొలిమేర 3’ వీడియో గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి వారు కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఎమ్ ఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్లపై సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.‘‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకు వస్తుందనే కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హారర్ చిత్రాల్లో మా సినిమా విభిన్నంగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగారి మీద స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు మేకర్స్. ‘‘ఆ పాట సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలవడంతో పాటు అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని మేకర్స్ ప్రకటించారు. మదర్ సెంటిమెంట్... హారర్ సుమన్ బాబు ముఖ్య పాత్రపోషించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎర్రచీర– ది బిగినింగ్’. కారుణ్య చౌదరి హీరోయిన్గా నటించగా, రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని, అయ్యప్ప పి.శర్మ కీలక పాత్రలుపోషించారు. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్–శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రోడక్షన్స్ పై నిర్మించిన ఈ సినిమా హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో రూపొం దింది.‘‘ఈ కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్, ఎక్కువ మంది అఘోరాలతో శివుడిని చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ బాగా వచ్చాయి. 45 నిముషాల పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలైట్‌గా నిలుస్తాయి. ప్రేక్షకులకు ఈ చిత్రం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. హారర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘ఎర్రచీర’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా కన్నడ నటుడు గణేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పినాక’. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో క్షుద్ర, రుద్ర పాత్రల్లో కనిపించనున్నారు గణేశ్. ఈ చిత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. -
బాలీవుడ్ లో భయం భయం
బాలీవుడ్లో హారర్ సినిమాల హవా కనిపిస్తోంది. గత ఏడాది విడుదలైన హిందీ హారర్ చిత్రాలు ‘స్త్రీ 2, భూల్ భూలెయ్యా 3, సైతాన్, ముంజ్య’ వంటివి సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఓ విధంగా 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు హారర్ చిత్రాలే వెన్నుదన్నుగా నిలిచాయి. ఇలా హారర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉందని గమనించిన బాలీవుడ్ స్టార్స్ వరుసగా ఆ తరహా చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ఆ హారర్ సినిమాల వివరాలపై ఓ లుక్ వేద్దాం...భూత్ బంగ్లాలో అక్షయ్ కుమార్హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్‌లది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో ‘హేరా ఫెరి, గరమ్ మసాలా, భూల్ భూలెయ్యా’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ 2010లో వచ్చిన ‘ఖట్టా మీఠా’ తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్లో మరో సినిమా అనౌన్స్మెంట్ రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. గత ఏడాది అక్షయ్ కుమార్ 57వ బర్త్ డే సందర్భంగా ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామెడీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడు. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వామికా గబ్బి, టబు, పరేష్ రావల్, జిస్సూ సేన్ గు΄్తా ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలుత ఈ హారర్ కామెడీ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్‌కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మరి.. హీరో అక్షయ్ కుమార్–దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ మరోసారి హిట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ.పోలీస్ స్టేషన్లో భూతంహారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్... ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేశారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అయితే హారర్ కామెడీ జానర్లో మాత్రం ఆయన సినిమా చేయలేదు. ఈ జానర్లోనూ తన సత్తా నిరూపించుకోవాలనిపోలీస్స్టేషన్ మే భూత్’ అనే సినిమాను ప్రకటించారు రామ్‌గోపాల్ వర్మ. ‘యూ కాంట్ కిల్ ది డెడ్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. ఈ చిత్రంలో మనోజ్ భాజ్‌పేయి లీడ్ రోల్ చేస్తారు. ‘మనకు భయం వేస్తేపోలీస్స్టేషన్కు వెళ్తాం. అదేపోలీసులకే భయం వేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్తారు?’ అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. ‘‘ఓపోలీస్స్టేషన్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది.ఈ ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్స్ దెయ్యాలుగా మారి,పోలీసులను ఇబ్బందిపెడితే ఎలా ఉంటుంది? అన్నపాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. హారర్ కామెడీ జానర్లోనే ఈ సినిమా ఉంటుంది’’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు రామ్‌గోపాల్ వర్మ. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారు. ‘సత్య’ (1998), ‘కౌన్’ (1999), ‘శూల్’ (1999) వంటి చిత్రాల తర్వాత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, హీరో మనోజ్ భాజ్పేయిపాతిక సంవత్సరాల తర్వాత మళ్లీపోలీస్స్టేషన్ మే భూత్’ సినిమా కోసం కలిసి పని చేస్తుండటం విశేషం.ప్రేతాత్మతోపోరాటంభూత, ప్రేతాత్మల నుంచి తన కుమార్తెను కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే అసాధారణపోరాటం నేపథ్యంలో సాగే హిందీ చిత్రం ‘మా’ (తెలుగులో అమ్మ అని అర్థం). కాజోల్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో రోనిత్ డాలీ, ఇంద్రనీల్ శుభ్రా, జితిన్ జ్యోతీ గులాటి లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సీరియస్ హారర్ సినిమాకు విశాల్ రేవంతి ఫ్యూరియా దర్శకత్వం వహించారు. అజయ్ వీణా దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. క్షుద్ర శక్తులు ఓ చిన్నారిని బలి కోరడం, తన కుమార్తె కోసం తల్లి ఓ క్షుద్ర శక్తులతో వీరోచితమైనపోరాటం చేయడం వంటì సీన్స్ ఈ చిత్రం ట్రైలర్లో కనిపిస్తున్నాయి.హాంటెడ్ హౌస్మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘1920’ (2008) సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘1920’ హారర్ సిరీస్‌లో వచ్చిన మరికొన్ని హారర్ సినిమాలతో అసోసియేట్ అయ్యారు విక్రమ్ భట్. తాజాగా ఆయన డైరెక్షన్లోనే ‘హాంటెడ్ హౌస్ 3డీ: ఘోస్ట్స్ ఆఫ్ ది ఫాస్ట్’ అనే సినిమా రానుంది. ఆనంద్ పండిట్, రాకేశ్ జునేజా, శ్వేతాంబరి భట్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాలో మహాక్షయ్ చక్రవర్తి, టియో బాజ్‌పాయ్, అంచిత్ కౌర్, ఆరిఫ్ జకారియా ప్రధానపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ చేస్తామన్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇండియన్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ ఫిల్మ్‌గా ‘హాంటెడ్ హౌస్ 3డీ: ఘోస్ట్స్ ఆఫ్ ది ఫాస్ట్’ మూవీ రానుంది.సైతాన్ తిరిగి వస్తాడుగత ఏడాది మార్చిలో థియేటర్స్‌లోకి వచ్చిన ‘సైతాన్’ ప్రేక్షకులను బాగా భయపెట్టాడు. అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, జ్యోతిక, జానకి బోడివాలా, అంగద్ రాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘సైతాన్’. వికాస్ బాల్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది మార్చిలో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను భయపెట్టి, సూపర్ హిట్ అయింది. ఆ సమయంలోనే ‘సైతాన్’ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు అజయ్ దేవగన్. అయితే ప్రస్తుతం అజయ్ దేవగన్ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత అజయ్ దేవగన్ ‘సైతాన్ 2’ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తారని ఊహింవచ్చు.ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ఫారెస్ట్లో భయం అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా హీరో హీరోయిన్లుగా హిందీలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే సినిమా రానుంది. హారర్ ఎలిమెంట్స్‌తోపాటు మైథలాజికల్ అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు అరుణభ్ కుమార్– దీపక్ మిశ్రా ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా నుంచి తమన్నాపాత్ర తాలూకు ప్రీ టీజర్లాంటి ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. రాత్రివేళ తమన్నా అడవిలోకి వెళ్లడం, అక్కడ ఓ దీపం వెలిగించడం వంటి విజువల్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ప్రేతాత్మగా రష్మిక?హారర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ ఈ సినిమాకు దర్శకుడు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో హారర్ చిత్రం ఇది. ఈ సినిమాలో రష్మికా మందన్నా డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఒకపాత్రలో ఆమె ప్రేతాత్మగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ప్రధానంగా నార్త్ ఇండియా లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిందట. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘థామా’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.మరికొన్ని హారర్ చిత్రాలు...మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగానే ‘శక్తి శాలిని’, ‘బేడియా 2’, ‘చాముండ’, ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’, ‘పెహ్లా మహాయు«థ్, దూస్రా మహాయు«ద్’ వంటి సినిమాలను ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోని ‘థామా’ సినిమా ఈ ఏడాది దీపావళికి, ఈ ఏడాది డిసెంబరు 31న ‘శక్తి శాలిని’, వచ్చే ఏడాది ఆగస్టు 14న ‘బేడియా 2’, డిసెంబరు 4న ‘చాముండ’ 2027లో ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’ చిత్రాలు, 2028లో ‘పెçహ్లా మహాయు«ద్, దూస్రా మహాయు«ద్’ సినిమాలు రిలీజ్ కానున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.ఇక వరుణ్ ధావన్ హీరోగా ‘బేడియా’ ఫ్రాంచైజీ, శ్రద్ధాకపూర్–రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్స్‌లో ‘స్త్రీ’ ఫ్రాంచైజీ వెండితెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ‘ముంజ్య’ సినిమాలో అభయ్ వర్మ, శర్వారీ లీడ్ రోల్స్ చేశారు. ఆదిత్య సర్పోత్థార్ డైరెక్షన్‌లోని ‘ముంజ్య’ సినిమా 2024లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ తరుణంలో ఈ సినిమా సీక్వెల్ ‘మహా ముంజ్య’లో వీరే నటిస్తారా? లేక కొత్త నటీనటులు కనిపిస్తారా? అని తెలియాల్సి ఉంది. ఇంకా ‘శక్తి శాలిని, చాముండ’ వంటి సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్‌కు హీరోయిన్స్ కియారా అద్వానీ, ఆలియా భట్ వంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
హారర్ సినిమాలు అంటే అమెరికా వాళ్ళు పడి చస్తారు..
-
బాక్సాఫీస్‌ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలు ఇవే!
ప్రతి సినిమా కథకీ ఒక సోల్ ఉంటుంది. ఆ ఆత్మ ఎంత బలంగా ఉంటే సినిమా అంతగా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఒకవేళ సినిమా కథే ‘ఆత్మ’ చుట్టూ తిరిగితే.. ఆ ఆత్మ భయపెడుతుంది... థ్రిల్‌కి గురి చేస్తుంది. ఆత్మ చుట్టూ అల్లిన కథ బలంగా ఉంటే.. బాక్సాఫీస్ ఖజానాని వసూళ్లు ఆవహించినట్టే. ఇక ప్రస్తుతం ఆత్మ, ప్రేతాత్మల నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ‘ఆత్మ’కథా చిత్రాల గురించి తెలుసుకుందాం.. రాశీ ఖన్నాకి హారర్ జానర్ అంటే ఇష్టం. అందుకే హారర్ జానర్లో సాగే ‘అరణ్మణై 3’కి చాన్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఓకే చెప్పేశారు. ఇప్పుడు నాలుగో భాగంలోనూ నటిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుందర్.సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్మణై’, ‘అరణ్మణై 2’, ‘అరణ్మణై 3’ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు నాలుగో భాగం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో ఆర్య హీరో. గత మూడు భాగాల్లో నటించిన చిత్రదర్శకుడు సుందర్ ఇందులోనూ కీలక పాత్రలో కనిపిస్తారు. రాశీ ఖన్నా ఒక కథానాయిక కాగా మరో నాయికగా తమన్నా నటిస్తున్నారు. మూడో భాగంలో ఆండ్రియా ఆత్మగా కనిపించారు. నాలుగో భాగంలో తమన్నానే ఆత్మ అని సమాచారం. మరి.. తమన్నా, రాశీల్లో ఆత్మ ఎవరనేది ఈ ఏడాది చివర్లో తెలిసిపోతుంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. క్యూట్ బ్యూటీ సమంత ప్రేతాత్మగా భయపెట్టనున్నారని సమాచారం. అది కూడా హిందీ ప్రేక్షకులను. ఆయుష్మాన్ ఖురానా, సమంత జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హారర్–కామెడీ జానర్లో సాగే ఈ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి ప్రేతాత్మ పాత్ర అని టాక్. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఆరంభమవుతుందని బాలీవుడ్ ఖబర్. ‘ఎవరికీ అంతు చిక్కని రహస్య ప్రపంచం భైరవ కోనలోకి ప్రవేశించండి’ అంటూ సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మిస్టరీ మూవీలో ఆత్మల నేపథ్యం కూడా ఉంటుందని సమాచారం. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఓ యువకుడు డిటెక్టివ్ కావాలనుకుంటాడు. ప్రేమలో పడిన అతడు తన ప్రేయసితో ఆనందంగా ఉంటాడు. అతని హ్యాపీ లైఫ్ ఒక టర్న్ తీసుకుంటుంది. రాత్రి సమయంలో రాకపోకలు నిషేధం అయిన మారేడు కోన ప్రాంతానికి అతను వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఊరికి ఆ యువకుడు ఎందుకు వెళ్లాడు? ఆ తర్వాత ఏం జరిగిందనే అంశంతో రూపొందుతున్న చిత్రం ‘అన్వేషి’. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రకథ ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలో సాగుతుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని ‘ఆత్మ’కథలు కూడా ఉన్నాయి. హారర్ జానర్‌కి ట్రెండ్‌తో పని లేదు. ఎప్పుడు తీసినా.. సరిగ్గా తీస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. మరి.. రానున్న ‘ఆత్మ’కథల్లో ఎన్ని కథలు ప్రేక్షకులకు నచ్చుతాయో చూడాలి. చదవండి: ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం -
OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు..
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మూవీ లవర్స్‌కు ఫేవరేట్‌గా మారిపోయాయి. కరోనాతో లాక్డౌన్ ఏర్పడిన సమయంలో ఎంటర్టైన్మెంట్కు ప్రత్యమ్నాయంగా నిలిచిన ఈ ఓటీటీల హవా ఇంకా జోరుగా సాగుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించడంలో తగ్గేదే లే అంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్‌ఫ్లిక్స్. ఎప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది. అయితే సినీ ప్రియులు మాత్రం ప్రతి జోనర్‌ను విడిచిపెట్టకుండా చూస్తారు. కానీ కొందరు ప్రేక్షకులు పర్టిక్యూలర్ జోనర్స్ మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫాంటసీ, స్కై ఫై, టైమ్ ట్రైవేల్, సూపర్ హీరోస్ వంటి జోనర్స్‌ను ఇష్టపడితే కొందరికి వెన్నులో వణుకు పుట్టించే హారర్ చిత్రాలు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వారికోసమే శుక్రవారం (మే 13) అతిగా భయపెట్టే 6 హారర్ సినిమాలను చూడమని సజ్జెస్ట్ చేస్తూ టైటిల్స్ తెలిపింది నెట్‌ఫ్లిక్స్. 'ఈ 13 తేదిన భయపడేందుకు ఈ సినిమాలు చూడండి' అని ట్వీట్ చేసింది. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. #WhatToWatchOnNetflix 🎥: 1. Bulbbul 2. The Conjuring 3. The Conjuring 2 4. The Haunting Of Hill House 5. Hereditary 6. Insidious: The Last Key — Netflix India (@NetflixIndia) May 13, 2022 నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరో ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా హారర్ మూవీస్‌ను సజ్జెస్ట్ చేసింది. తన ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న హారర్ సినిమాల టైటిల్స్‌ను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. వీటిలో ది పాస్ట్, అమరికన్ హారర్ స్టోరీస్, ది హిల్స్ హ్యావ్ ఐస్ 2, లెట్స్ ప్లే, లిఫ్ట్‌తోపాటు పలు హారర్ మూవీస్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హర్రర్ సినిమాలు చూసే దమ్ముందా?.. రూ.లక్ష సొంతం!!
Horror Movies Challange: నయనతార నటించిన మయూరి(మాయా) సినిమా గుర్తుందా?. తాను తీసిన హర్రర్ సినిమాను ఒంటరిగా, భయపడకుండా చూస్తే.. నగదు బహుమతి ఇస్తానంటూ అందులో డైరెక్టర్ క్యారెక్టర్ ఓ ప్రకటన ఇస్తుంది. అంతేకాదు సినిమా చూస్తున్నంత సేపు హార్ట్-పల్స్బీట్ను పరిశీలిస్తుంటారు కూడా. దాదాపు లక్ష రూపాయల ప్రైజ్ మనీతో అలాంటి ప్రకటననే జారీ చేసింది ఓ కంపెనీ. కాకపోతే అది మనదేశంలో కాదులేండి. హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉంటారో.. దానిని చూడడానికి అంతే కష్టపడేవాళ్లు అంతేమంది ఉంటారు. కానీ, అమెరికాలో ఓ కంపెనీ.. హర్రర్ సినిమాల్ని చూసేవాళ్లకు లక్ష దాకా ప్రైజ్ మనీ ఇస్తుందట. అమెరికాలోని ఫైనాన్స్‌బజ్ అనే ఫైనాన్స్ కంపెనీ ఈ నొటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ నెలలో వాళ్లు ఎంపిక చేసిన పదమూడు హాలీవుడ్ హర్రర్ సినిమాల్ని పదిరోజుల్లో చూసేయాలి. అదీ రేప్పేయకుండా.. భయంతో వణికిపోకుండా!. చాలెంజ్‌లో గెలిస్తే 1,300 డాలర్లకిపైగా(దాదాపు లక్ష దాకా) ప్రైజ్‌మనీ ఇస్తారు. అయితే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే కండిషన్ పెట్టారు. త్వరలో హాలీవుడ్లో కొన్ని హర్రర్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తరుణంలో హైబడ్జెట్.. లోబడ్జెట్ హర్రర్ సినిమాల్లో ఏవి ఎక్కువగా భయపెడతాయి అనేది తెలుసుకునేందుకు ఫైనాన్స్‌బజ్ ఈ ప్రయత్నాన్ని చేస్తోంది. లిస్ట్‌లో ‘సా, ఎమిటీవిల్లే హర్రర్, ఏ క్వైట్ ప్లేస్, ఏ క్వైట్ ప్లేస్-2, క్యాండీమ్యాన్, ఇన్సైడియస్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సిన్స్టర్, గెట్ అవుట్, ది పర్గే, హలోవీన్(2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నాబెల్లె’ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబర్ 26 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఇక ఒంటరిగా ఈ సినిమాలు చూస్తున్నంత సేపు ఫిట్‌బిట్ సాయంతో హార్ట్, పల్స్ రేట్‌ను మానిటర్ చేయబోతున్నారు. ఏమైనా తేడాలు అనిపిస్తే.. ఆ వ్యక్తిని సినిమా చూడడం ఆపేయమని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక ఈ ఫిట్‌బిట్‌ను ఫైనాన్స్‌బజ్ కంపెనీ వాళ్లే అందిస్తారు. అంతేకాదు సినిమాలు చూడడానికి 50 డాలర్ల రెంటల్ డబ్బును కూడా చెల్లిస్తున్నారు. ఇంతకీ ఈ ఉద్యోగానికి పెట్టిన పేరేంటో తెలుసా.. ‘హర్రర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్’. చదవండి: మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్లు -
దెయ్యాలను నిజంగా చూడాలనుకుంటున్నారా?
దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఇది ఇప్పట్లో ఒడవని ముచ్చట. కానీ దెయ్యాల మీద వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను భయపెట్టించి మరీ కాసులు కురిపించాయి. ముఖ్యంగా హాలీవుడ్లో దెయ్యాల సినిమాలు అనగానే గుర్తుకువచ్చేవి ది ఎగ్జారిస్ట్, ది కంజ్యూరింగ్, అనబెల్లె. వీటికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. అయితే "ది కంజ్యూరింగ్" సినిమా పుట్టుకకు కారణం.. పైన కనిపిస్తున్న భవనమే. ఇప్పుడీ భవనం లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, మనమూ హారర్ సినిమాలో ఓ భాగమైనట్లు అనుభూతి చెందేందుకు ఓ కొత్త కార్యక్రమం రాబోతోంది. కొంతమంది ఈ ఇంట్లోకి వెళ్లి వారి ప్రతీ కదలికలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. దాన్ని మనం ఇంట్లో నుంచే వీక్షించవచ్చు. చుక్కలు చూపించిన దయ్యాలు ఎన్నో యేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో తరతరాలుగా నివసిస్తున్న ఓ కుటుంబం ఆ ఇంట్లో నుంచి నిష్క్రమిద్దాం అనుకునే లోపే వారు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి అడుగుపెట్టినవారికి వింత అనుభవాలు ఎదురయ్యేవి. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దెయ్యాల పరిశోధకులు లోరెన్, ఎడ్ వారెన్ ఆ భవనంలోకి అడుగుపెట్టి సునితంగా అధ్యయనం చేశారు. అనంతరం అక్కడ దెయ్యాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అదే సమయంలో వారి కుమార్తె ఆండ్రియా ఈ ఇంటి గురించి "హౌస్ ఆఫ్ డార్క్నెస్ హౌస్ ఆఫ్ లైట్: ద ట్రూ స్టోరీ" అనే పుస్తకం రాసింది. లైట్లు వెలుగుతూ.. ఆరిపోతూ.. ఆ తర్వాత 1970లో ఓ కుటుంబం ఆ ఇంట్లోకి దిగింది. అయితే నెమ్మదిగా అక్కడ ఉన్న దెయ్యాలు చుక్కలు చూపించడం మొదలు పెట్టాయి. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ వాళ్లు ఏడాదికే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత అది ఎన్నో హారర్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచింది. హీన్జెన్ అనే వ్యక్తి గతేడాది ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు అతీత శక్తుల కదలిక ఉన్నట్లుగా గుర్తించాడు. ఆ మేరకు గదుల్లో అడుగుజాడలతోపాటు, తలుపు కొట్టుకుంటున్న శబ్ధాలు, లైట్లు వాటంతటవే వెలుగుతూ, ఆగిపోవడం కనిపించిందన్నారు. దీంతో కొంతమంది దెయ్యాల పరిశోధకులను ఇంట్లోకి పంపించి, వారి అనుభవాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. మే 9 నుంచి ఇంట్లోనే ఉంటూ వారం రోజులపాటు లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే మే 8న ద హౌస్ లైవ్ కార్యక్రమానికి సంబంధించి చిన్న ప్రివ్యూ కూడా వదలనున్నారు. దీన్ని డార్క్ జోన్ వెబ్సైట్ ఏర్పాటు చేస్తోంది. (ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు) నిజమైన దెయ్యాలను చూడవచ్చు ఇక ప్రేక్షకులు కంజ్యూరింగ్ హౌస్‌లో ఉన్నట్లుగా అనుభూతి చెందేదుకు ఆ ఇంట్లో పలు కెమెరాలను అమర్చనున్నారు. తద్వారా అతీత శక్తుల అలజడిని ప్రతి ఒక్కరూ స్వయంగా చూడగలరని డార్క్ జోన్ వెబ్సైట్ పేర్కొంటోంది. ఇంకేముందీ మీరూ సినిమా చూసేస్తామని రెడీ అయిపోకండి. ఎందుకంటే ఇది ఉచితమేమీ కాదు చిన్నపాటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఒక్కరోజు లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి నాలుగున్నర డాలర్లు, వారమంతా చూడటానికి పంతొమ్మిదిన్నర డాలర్లు ముట్టజెప్పాల్సి ఉంటుంది. అలా వచ్చిన డబ్బునంతా కోవిడ్-19 వ్యతిరేకంగా పనిచేసే చారిటీలకు ఇవ్వనున్నారు. టికెట్లు కొనుగోలు మే1 నుంచే ప్రారంభమైంది. ఇంకెందుకాలస్యం.. మరిన్ని వివరాలకు Darkzone వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసేయండి, టికెట్లు బుక్ చేసుకుని దెయ్యాలను కనులారా వీక్షించండి. -
మోహిని ట్రైలర్ రిలీజ్
-
మా వంశ దెయ్యాంకురం!
‘‘దెయ్యాలు ఫేస్‌పౌడర్ వాడతాయా?’’ అని మా రాంబాడుగాడిని అడిగాడు మా బుజ్జిగాడు. వాడీమధ్య హారర్ సినిమాలు టూమచ్‌గా చూస్తున్నాడు. దాంతో దెయ్యాల గురించి తరచూ తరచి తరచి అడుగుతున్నాడు. నన్నేమైనా అడిగితే ‘‘చల్... దెయ్యం లేదు... భూతం లేదు... ఫో’’ అంటూ కసురుకుంటాను కదా. అందుకే వాడు మా రాంబాబుగాడిని తగులుకున్నాడని నాకు అనిపిస్తోంది. అన్నట్టు... మా బుజ్జిగాడి ప్రశ్నకు రాంబాబు గాడు ఏం చెబుతాడా అని నాకూ అనిపించింది. దాంతో నేనూ ఆసక్తిగా వినడం మొదలు పెట్టాను. ‘‘ఏమోరా! ఐడియా లేదు. అవి తెల్లచీరలైతే కడతాయి. సినిమాల్లో చూసిన దాని ప్రకారమైతే కొన్ని దెయ్యాల ముఖం పౌడరు పూసినట్టుగా, మరీ ఎక్కువ తెల్లగా ఉంటుంది. కానీ పౌడరు పూసినందువల్ల అలా ఉంటుందా లేక వాటికి కావాల్సిన పౌష్టికాహారమైన రక్తం తగినంత దొరకక రక్తహీనత వచ్చిందా అన్న విషయంలో నాకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. అవి డాక్టర్ దగ్గరికి పోయి బ్లడ్‌టెస్ట్ చేయించినట్టుగా మనకెక్కడా ఎప్పుడూ సమాచారం ఎప్పుడూ లేదు. కాకపోతే చంద్రముఖి సినిమాలో చూసినదాన్ని బట్టి అందులోని దెయ్యం మాత్రం కాటుకను కాస్త ఓవర్‌గా పూసుకుంటుంది. కాబట్టి... కాటుకా పౌడర్ విషయానికి వస్తే... అవి కాటుకను విరివిగా వాడతాయని తెలుసుగానీ పౌడర్ విషయంలో మాత్రం మనకో స్పష్టత లేదురా’’ అని ఆన్సర్ ఇచ్చాడు రాంబాబుగాడు. ‘‘ఎలాగూ అనీమియాతో రక్తం తక్కువైనందువల్ల ముఖం తెల్లగానే ఉంటుంది కదా. ఆల్రెడీ ఫెయిర్‌గా ఉండే ముఖానికి మళ్లీ ఫేస్‌పౌడరు ఎందుకు? మరి దెయ్యాలు పళ్లు తోముకోడానికి పేస్ట్ వాడతాయంటావా?’’ మరో ప్రశ్నను సంధించాడు బుజ్జిగాడు. ‘‘అవి పండ్లూ, ఫలాలు తినే దాఖలా లేదు. డ్రాక్యులా సినిమాల ప్రకారం... రక్తం పీల్చడానికి వాటికి రెండు కోర పళ్లు చాలు. కేవలం రెండు పళ్ల సంరక్షణ కోసం అంతలా టూత్ పేస్టు అవసరం లేదు. అయినా ఆడ దెయ్యాలు జుట్టు విరబోసుకున్నా అప్పుడే షాంపూ చేసుకున్నట్లుగా, చక్కగా తల దువ్వుకొని ఉంటాయి. మగదెయ్యాలు మాత్రం చింపిరి జుట్టుతో చిందరవందరగా, చిరాగ్గా కనిపిపిస్తుంటాయి. దీని ప్రకారం ఆడదెయ్యాలు స్వచ్ఛభారత్ నినాదాన్ని చక్కగా పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటాయనీ, మగదెయ్యాలు ఏమాత్రం తమ నీటుగా కనిపించవనీ అర్థమవుతోంది కదా’’ అని బదులిచ్చాడు వాడు.ఇలా మాట్లాడుతుండగానే రాంబాడు గాడి మొబైల్ మోగింది. ఏదో మాట్లాడి పెట్టేయగానే మళ్లీ మావాడు ప్రశ్నలతో తయారయ్యాడు. ‘‘ఇంతకీ దెయ్యాలు సెల్‌ఫోన్ వాడుతుంటాయంటావా?’’ ఆసక్తిగా అడిగాడు.‘‘ఏమోరా... మామూలుగా స్వీట్ వాయిస్‌తో ఉండే అమ్మాయిలు కూడా తాము దెయ్యాలయిపోయాక చాలా బొంగురుగొంతుతో మాట్లాడతాయని మనకు తెలుసు. మరి అవి సెల్‌ఫోన్ వాడతాయా, వాట్సాప్ మెసేజీలు పెడతాయా, మెయిల్స్ పంపుకుంటాయా అన్న విషయం మనకు ఇదమిత్థంగా తెలియదు. కాకపోతే లేటెస్ట్గా నేను చూసిన వాల్‌పోస్టర్‌లో ఒక మగదెయ్యం చుట్టూ నోట్లో పెట్టుకొని స్మోకింగ్ చేస్తోంది. దానికోసారి ‘ఈ నగరానికేమైంది... బహిరంగ ధూమపానానికి తప్పదు జరిమానా’ అనే ఆ సినిమా ట్రైల్పార్టీను చూపించాలని నాకు అనిపించింది రా’’ అన్నాడు రాంబాబుగాడు. మావాడు అడుగుతుంటే నాకూ ఓ మాట తోచింది. దెయ్యాలకు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. వాటికి ఏటీయం క్యూలలో నిలబడాల్సిన ఖర్మ పట్టలేదు. వాటికి అలాంటి అగత్యం ఏమీ లేదు కదా అనిపించింది. ‘‘అయితే ఈ లెక్క ప్రకారం... దెయ్యాలకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. అవి మొబైల్ రీఛార్జీలు చేయించనక్కర్లేదు. వైఫైలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫేస్పౌడర్లు రాసుకోనక్కర్లేదు. పేస్టులూ, బ్రష్షులూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనలా మంచి మంచి బిల్డింగులు కూడా అక్కర్లేదు. వాటికి పాడుబడ్డ భవనాలే చాలు. ఇక దెయ్యాల ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించినా... పాపం... ఏదో రక్తహీనతలాంటి జబ్బులే తప్ప... వాటికి చూపు పవర్ తగ్గిన దాఖలా లేదు. కనీసం కళ్లజోడు పెట్టుకున్న దెయ్యం ఒక్కటీ లేదు. మరి నేను చూసిన హారర్ సినిమాల ప్రకారమైనా... నువ్వు చూసిన తెలుగు సినిమాల లెక్కలోనైనా ఒక్క దెయ్యమూ మనం పడే కష్టాలను పడటం లేదు కదా. దాన్ని బట్టి వాటి లైఫే బాగుంది కదా. మరి అవి అంత హాయిగా బతుకుతూ ఉంటే... అందరూ దెయ్యాలంటే చిన్నచూపు చూస్తుంటారు. దెయ్యం బతుకును చూసి భయపడుతుంటారు?’’ లాజికల్‌గా అడిగాడు బుజ్జిగాడు.అంతంత పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు చేసే మా రాంబాబుగాడు కూడా వాడి ప్రశ్నకు ఏమీ ఆన్సరు చెప్పకుండా అవాక్కయిపోయాడు. కానీ ఎప్పుడూ ఏ వాదనలోనైనా సరే... తానే గెలిచే మా రాంబాబు గాడు మావాడి ప్రశ్నలను తట్టుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్... పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తెలుసుగానీ... మీవాడు పుట్టకముందే పరిమళిస్తున్నాడేమిట్రా. ఏదేమైనా గానీ వీడికి స్వజాతి ఫీలింగు ఎక్కువే’’ అంటూ మావాడి మీద తన అక్కసంతా వెళ్లగక్కాడు. – యాసీన్ -
మరో సారి భయపెడతా!
ఒక పక్క కమర్షియల్ చిత్రాలు, ప్రేమ, హాస్యభరిత చిత్రాలు వస్తున్నా, హారర్ చిత్రాల ట్రెండ్‌కు మాత్రం ఏమాత్రం ఢోకా లేదనిపిస్తోంది. ఇంతకు ముందు చిన్న తారలు, మార్కెట్‌లేని సీనియర్ నటీనటులు హారర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ప్రముఖ తారలే నటించడానికి రెడీ అంటున్నారు. ముఖ్యంగా టాప్ కథానాయికలతో హారర్ కథా చిత్రాలు తీయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మాయ చిత్రంలో నటించిన నయనతార తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్ర నాయకిగా హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆ తరహా కథాంశంతో రూపొందుతున్న దోర అనే దెయ్యం ఇతివృత్తంతో సాగే నాయకి పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటించడానికి నయనతార రెడీ అవుతున్నారు. ఇక మరో సంచలన నటి త్రిష కూడా నయనతార బాణీనే అవలంభిస్తోందని చెప్పవచ్చు. నిన్నటి వరకూ కుటుంబకథా చిత్రాల నాయకిగా నటించిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు హారర్ చిత్రాలపైకి దృష్టి మళ్లించారు. త్రిష ద్విపాత్రాభినయం చేసిన నాయకి చిత్రం తెలుగులో తెరపైకి వచ్చి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.త్వరలో తమిళంలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మోహిని అనే మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తున్నారు. అధిక భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఇదీ హారర్ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమే.తాజాగా మరో హారర్ చిత్రానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అనీ, ఆ చిత్ర డీవీడీని ఓ ప్రముఖ నిర్మాత చూడమని త్రిషకు పంపినట్లు తెలిసింది. ఆ చిత్రం చూసిన త్రిష దాని రీమేక్‌లో నటించడానికి సమ్మతించినట్లు టాక్. ఇందులోనూ ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
హారర్ చిత్రాలొద్దు బాబోయ్
హారర్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి నిక్కీగల్రాణి ఇప్పుడలాంటి చిత్రాలు వద్దంటున్నారు. ఈ అమ్మడికి ఆదితో నటించిన యాగవరాయనుమ్ నాకాక్క తొలి చిత్రం అయినా తెరపైకి వచ్చిన మొదటి చిత్రం మాత్రం డార్లింగ్. జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి తను హారర్ రొమాన్స్ చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా అవకాశాలు నిక్కీగల్రాణి తలుపుతడుతున్నాయి. కో-2, వేల్లన్ను వందుట్టా వెళ్లక్కారన్ వంటి ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణను పొందాయి. మధ్యలో దెయ్యం కథా చిత్రాల అవకాశాలు చాలా వచ్చాయట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ డార్లింగ్ చిత్రం తరువాత ఆ తరహా దెయ్యం చిత్రాల అవకాశాలు పలు వచ్చాయన్నారు. అయితే వరుసగా అలాంటివే చేస్తే దెయ్యం చిత్రాల నాయకి అనే ముద్రవేస్తారని భయంతో నిరాకరించానని చెప్పారు. అయితే ప్రతీకారం తీర్చుకునే పాత్రలు కాకుండా వైవిధ్యభరిత కథా పాత్రలైతే హారర్ చిత్రాలు చేయడానికి రెడీ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కెట్టశివ మొట్టశివ, నెరుప్పుడా, కీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు, మరగద నాణయం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే కెట్టశివ మొట్టశివ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు, నెరుప్పుడా చిత్రాల్లో అందాలారబోతలో దుమ్మురేపుతున్నారట. ఈ చిత్రాలతో యువతకు మరింత దగ్గరవుతాననే నమ్మకాన్ని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. -
చిన్న బ్రేక్!
ఒకే తరహా సినిమాలు చేస్తే చేసేవాళ్లకి, చూసేవాళ్లకి బోర్. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎంపిక చేసుకోవాలని నటీనటులు ఆరాటపడుతుంటారు. ఇప్పుడు త్రిష మైండ్ సైట్ అలానే ఉంది. కళావతి, నాయకి, మోహిని.. ఇలా వరుసగా హార్రర్ మూవీస్ చేయడం త్రిషకు రొటీన్ అనిపించిందట. అందుకని అలాంటి చిత్రాలకు చిన్న బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మంచి మాస్ మసాలా ఫార్మాట్లో సాగే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో ఆమె చేస్తున్న ‘కొడి’ అలానే ఉంటుందట. -
భయం పోయిందా?
మీకెలాంటి సినిమాలంటే ఇష్టం? అని త్రిషను అడిగితే.. మంచి లవ్‌స్టోరీస్, యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం అని చెబుతారు. మరి... హర్రర్ మూవీస్ అంటే ఇష్టం లేదా? అనడిగితే.. ‘‘వామ్మో.. అవంటే నాకు చాలా భయం. చూడ్డానికి ఇష్టపడను. అలాంటి సినిమాల్లో యాక్ట్ చేయాల్సి వస్తే, ‘నో’ చెప్పేస్తానేమో’’ అనేవారు. అలాంటి త్రిష వరుసగా హర్రర్ మూవీస్‌లో నటిస్తున్నారు. ఆ మధ్య హర్రర్ మూవీ ‘కళావతి’లో నటించారు. తాజాగా ‘నాయకి’ అనే మరో హర్రర్‌లో యాక్ట్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో హర్రర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా వరుసగా హర్రర్ మూవీస్ చేస్తున్నారంటే... ఆ తరహా సినిమాల మీద త్రిషకు ఉన్న భయం పోయినట్లేగా! ఇక, తాజాగా ఆమె అంగీకరించిన హర్రర్ మూవీ విషయానికొస్తే.. ఇది తమిళ చిత్రం. ఇంకా టైటిల్ పెట్టలేదు. మాదేష్ అనే దర్శకుడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. మెర్విన్ సాల్మన్-వివేక్ అనే ఇద్దరు సంగీతదర్శకులు పాటలు స్వరపరచనున్నారు. ఈ నెలాఖరున షూటింగ్ ఆరంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను 30 రోజుల పాటు లండన్‌లో జరపనున్నారు. అత్యధిక శాతం షూటింగ్ అక్కడే జరుగుతుంది. -
హారర్ మూవీస్‌తో భయపెట్టబోతున్న త్రిష
-
హర్రర్ సినిమాలు చూడనివ్వండి..
లండన్: పిల్లలు హర్రర్ సినిమాలు చూస్తుంటే చాలా మంది తల్లిదండ్రులు వద్దంటారు. ఎందుకంటే దాని వల్ల వారు భయాందోళనలకు లోనైతే మానసిక పరమైన సమస్యలు వస్తాయని వారి భయం. అయితే ఇక నుంచి తల్లిదండ్రులు అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా మీ చిన్నారులను హర్రర్ సినిమాలను చూడనివ్వండి అని అంటున్నారు లండన్ పరిశోధకులు. నిజానికి ఇలాంటి సినిమాలు చూసిన అందరూ భయపడి ఒత్తిడికి లోనవుతారనేది వాస్తవం కాదని అన్నారు. చాలా కొద్ది మంది చిన్నారులు మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారని, అది కూడా మరీ చిన్న వయసు వారిలో మాత్రమే ఇలా జరుగుతుందని తెలిపారు. కాబట్టి ఎవరో ఒకరిద్దరిలో ఇలా జరుగుతుంది కాబట్టి మొత్తం చిన్నారులందరినీ వీటికి దూరం చేయడం సమంజసం కాదని పరిశోధకులు పేర్కొన్నారు. ‘అయితే ఆ కొద్ది మంది చిన్నారులు మాత్రం ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎందుకు భయం, ఆందోళన, ఒత్తిడి.. వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే దానిపై మరింత పరిశోధన జరగాలి. దీనికి కారణాలు తెలిస్తే వీటి గురించి తల్లిదండ్రులకు మరింత విలువైన సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఫీల్డ్ అన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ‘హ్యూమన్ కమ్యూనికేషన్ రీసెర్చ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
2014లో హర్రర్ చిత్రాల హవా!
-
హాలోవీన్ డెవిల్స్ డే ఔట్
హారర్ సినిమాలు తీసే రామ్సేలూ, రామ్గోపాల్వర్మలకు డూప్‌లు పుట్టుకొచ్చే రోజిది. కాళరాత్రి నుంచి కాంచన దాకా సినిమా దెయ్యాలన్నింటిని గుర్తు చేసే రోజిది. భూత ప్రేత పిశాచాలంటే నమ్మని నవ యువత సైతం నేనే దెయ్యం.. నేనే డెవిల్ అంటూ సందడి చేసే ‘డెవిల్స్ డే అవుట్’ ఇది. శుక్రవారం హాలోవీన్ నైట్ సందర్భంగా భయపడేవారినీ, భయపెట్టే వారినీ ఒకచోట చేరుస్తూ సిటీలో పబ్బులూ క్లబ్బుల్లో స్పెషల్ థీమ్స్ సిద్ధమయ్యాయి. చీర్స్‌తో చిల్ అవుట్ అవడంతో పాటు హర్రర్‌తో హ్యాంగవుట్కమ్మని ఆహ్వానిస్తున్నాయి. భయపెట్టడంలో, భయపడడంలో ఉన్న సరదా యూనివర్సల్. అందుకేనేమో... హాలోవీన్ నైట్ అనే వెస్ట్రన్ కాన్సెప్ట్ సిటీలో బాగా ఊపందుకుంటోంది. వెరైటీ అనుభవాల్ని ఆశించే యూత్ కారణంగా ఏటా అక్టోబర్ 31న హాలోవీన్ నైట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. హారర్‌ను థీమ్‌గా తీసుకుని సాగే ఈ హాలోవీన్ నైట్ ఇప్పుడు దాదాపు ప్రతి పబ్‌కూ, క్లబ్‌కూ తప్పనిసరి నైట్ ఈవెంట్. ‘అవును’ నేను దయ్యాన్ని.. అని చెప్పుకున్నట్టు ఉంటాయీ హాలోవీన్ పార్టీలు. వీటికి హాజరైన వారికి వెల్కమ్ చెప్పే వ్యక్తి నుంచి వీడ్కోలు పలికే వారి వరకూ అంతా భయపెట్టే గెటప్స్‌తోనే ఉంటారు. గెస్ట్‌లు కూడా పార్టీలోకి ఎంటరైన కాసేపటికే తాము సైతం దయ్యాలైపోతారు. శక్తిమేరా ఇతరుల్ని భయపెట్టడం కోసం మాస్క్‌లు మస్కారాలు, టాటూలు, పెయింట్లూ.. యువత వంటిపై నాట్యం చేస్తాయి. దయ్యాలు, భూతాలు, మంత్రగాళ్లు, రాబందులు, వాంపైర్స్, ఏంజెల్స్... ఇలా కాదేదీ గెటప్కూ, డ్రెస్సప్కూ అనర్హం అన్నట్టు అమ్మాయిలు, అబ్బాయిలు సిద్ధమవుతారు. భయ‘భ్రాంతులు’... చిమ్మ చీకటి. పిన్‌డ్రాప్ సెలైన్స్. ఆకాశంలో నక్షత్రాల్లాగా అక్కడక్కడ మెరుపులు. ఫెడేల్మని ఏదో విరిగిన శబ్దం. దాని వెంటనే హిహిహి... హెహెహె అంటూ ప్రేతాత్మలు రువ్వే వెకిలి నవ్వులు. కాసేపటికి ఆ శబ్దం ఊపందుకుంటూ...దానితో పాటే ఒకటొకటిగా విరబోసుకున్న కురులతో దయ్యాలు...(మాస్క్‌లు ధరించిన అమ్మాయిలు) ఊగిపోవడం మొదలు. అలాగే వీరిని నియంత్రించే మంత్రగాళ్లలా, స్తోత్రించే భూతారాధకులు... ఇలాంటి సందడి ఒకచోటైతే... మరోచోట... ఆత్మల్ని ఆహ్వానిస్తూ పూజలు చేస్తున్నట్టుంటే మరికొందరు ప్రత్యక్షమైన ఆత్మల్లా అభినయిస్తారు. జడిపించే మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ ‘థ్రిల్లర్’, తీతువుపిట్ట అరుపుల దగ్గర్నుంచి నక్కల ఊళలు, కీచురాళ్ల చప్పుళ్ల దాకా హారర్ మూవీస్‌లోని థీమ్ మ్యూజిక్లన్నీ కలగలిపి భయపెట్టడం డీజే వంతు. - హాలోవీన్ నైట్ అనేది శతాబ్దాల క్రితం నాటి పాశ్చాత్య ఒరవడి. దీని పుట్టుక వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వినిపించేది...చనిపోయిన వారి ఆత్మల్ని గౌరవించడానికి, అదే సమయంలో అవి తమనేవీ చేయలేవని చెప్పడానికి ఈ సెలబ్రేషన్ పుట్టిందనే కథ. - ఇది విశ్వసించే వారు ప్రత్యేకంగా ఒకరోజును నిర్ణయించుకుని, ఆ రోజు రాత్రి వేడుకలు నిర్వహిస్తారు. రాత్రివేళ తిరిగే భూతప్రేతాల్ని భయపెట్టడానికి భయంకరమైన కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. కాలక్రమంలో ఇదొక కాస్ట్యూమ్స్ పార్టీలా మారింది. - ఇది పెద్దవాళ్ల వేడుక కాబట్టి దీనిలో పిల్లల కోసం ట్రిక్ ఆర్ ట్రీట్ అనే ప్రత్యేకత జత చేశారు. స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ తరహా గెటప్స్ వేసుకున్న పిల్లలు ఇంటింటికీ వెళ్లి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని వీరి గుప్పిట్లో బోలెడు చాక్లెట్స్ వేస్తారు. అలా పోగు చేసుకువచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు...ఎట్సెట్రాలన్నింటినీ పిల్లలు రాత్రి సమయంలో ఒకచోట చేర్చి ఎంజాయ్ చేస్తారు. సిటీలో... హారర్ హంగామా... ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెల చివరి వారం నుంచే దీనిని నిర్వహిస్తున్నారు. సిటీలో వారం క్రితం నుంచి ఈ హడావుడి మొదలైంది. హాలోవీన్ బార్బీ ఫ్రైడే, హాలోవీన్ సన్డౌన్ పూల్ పార్టీ, థ్రిల్లర్ థీమ్ పార్టీ వంటివి జోరందుకున్నాయి. ఇక శుక్రవారం రాత్రి సందడికి... దాదాపు అన్ని పబ్స్, క్లబ్స్ రెడీ అయ్యాయి. రాజ్భవవన్ రోడ్‌లోని కిస్మత్, జూబ్లీహిల్స్‌లోని అవాస, దుర్గం చెరువు దగ్గరున్న ఆలివ్, ప్లేబోయ్... స్వదేశీ దెయ్యాలు... మనుషులకున్నట్టే పిశాచాల్లో కూడా స్వదేశీ, విదేశీ ఉంటాయి కదా. అందుకే కిస్మత్ పబ్ దేశీ థీమ్‌తో ఈ దెయ్యాల పండుగ నిర్వహిస్తోంది. హాలోవీన్ పార్టీ సంథింగ్ డిఫరెంట్. అంతా థీమ్ బేస్డ్. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈసారి పార్క్ హోటల్లోని కిస్మత్ పబ్‌లో హాలోవీన్ నైట్ పార్టీలో ప్లే చేస్తున్నా. ఇది దేశీ థీమ్‌తో సాగుతుంది. ఈ హాలోవీన్ నైట్‌ని సిటీ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. - డీజే పీయూష్ టాటూల జోరు.. గెటప్పుల హుషారు తేళ్లు, సాలెపురుగులు, రక్తపిశాచి.. ఎట్సెట్రా రూపాలు వేసుకుని భయపెట్టాలంటే తప్పనిసరిగా టాటూలు జత చేయాల్సిందే ‘‘శుక్రవారం అంతా ఫుల్ బిజీ. మా క్రియేటివిటీకి పదును పెట్టిస్తుంది హాలోవీన్ నైట్’’ అంటున్నాడు సిటీకి చెందిన టాటూ డిజైనర్ శ్రవణ్‌కుమార్. ఇక శ్రీనగర్‌కాలనీ, బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ ఎదురుగా ఉన్న రోడ్లలోని షాప్స్, సికింద్రాబాద్‌లోని ప్రకాష్ పార్టీ షాప్... వంటి షాప్‌లు రెండురోజులుగా భయపెట్టే మాస్క్‌లు, కోరలు... వగైరాల అమ్మకాల్లో బిజీగా ఉన్నాయి. ‘‘భయపెట్టేందుకు ఎన్ని దారులున్నాయా అని యూత్ అన్వేషిస్తున్నారు. మేం కూడా రకరకాల ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తున్నాం. పబ్స్‌కు, క్లబ్స్‌కు స్కెలిటిన్, స్కల్, పంప్కిన్, మాస్క్‌లు, డ్రాకులా టీత్, విట్జ్ హ్యాట్స్ వంటివి సప్లయ్ చేయడంతో పాటు ఈసారి ఆలివ్ బిస్ట్రో పబ్‌లో హాలోవీన్ థీమ్ డెకరేషన్ కూడా చేశాం’’ అంటూ చెప్పారు పార్టీ నీడ్స్ నిర్వాహకులు సునీల్. - ఎస్.సత్యబాబు -
కోటలో దెయ్యం ఉందా?!
విచిత్రం హారర్ సినిమాలు చూసి, దెయ్యం కథనాలు చదివి, పురాతన భవంతులు, కోటల గురించి తెలుసుకొని చాలామంది భయపడు తుంటారు. అలాంటి గమ్మత్తయిన అనుభవమే నాకూ ఎదురైంది. రెండేళ్ల క్రితం... శీతకాలంలో ఢిల్లీలో ఉన్న మా మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లాను. వారి ఇద్దరు అబ్బాయిలు చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘రాజస్థాన్ చూడటానికి వెళుతున్నాం. నువ్వూ రావాలి’ అంటే వెళ్లాను. వాళ్లతో ప్రయాణం అంటే మహా సరదా నాకు. పింక్‌సిటీగా పేరొందిన జైపూర్, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటూ చాలా సరదాగా గడిపాం. తర్వాత రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఉన్న భాన్‌గఢ్ కోటకు వెళ్లాం. 1613లో ఈ కోటను నిర్మించారు. అప్పటికే ఆ కోట గురించి కొంత సమాచారం తెలిసి ఉండటంతో మా అందరికీ ఆసక్తిగా అనిపించింది. విషయమేంటంటే ‘దెయ్యాలు వేటాడే ప్రాచీన పట్నంగా’ ఆ ప్రాంతానికి పేరుంది. మాకెంత మాత్రం ఇది నిజం అనిపించలేదు. కోటను చేరుకున్నాం. శిథిలమైన గోడలతో... సినిమాల్లో చూపే దెయ్యాల కోటలు గుర్తుకు వచ్చాయి. కోటకు వెళ్లే దారిలో పురావస్తుశాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు మీద ‘సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఈ కోట లోపలికి, చుట్టుపక్కలకు వెళ్లడం నిషిద్ధం’ అని రాసుంది. దెయ్యాలున్నాయనే కారణంగా ఆ బోర్డు ఏర్పాటు చేశారని తెలిసింది. ఆ కోటలో భాన్‌గఢ్ రాజ్యపు యువరాణి రత్నావతి, ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించిన సింఘియా అనే మంత్రగాడు ఇద్దరూ యౌవనంలో మరణించారనీ, పగతో రగిలిపోయే వారు ఆ ప్రాంతంలోనే తిరుగాడుతున్నారనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోనూ దెయ్యాలున్నాయని గుడ్డిగా నమ్మడం ఆశ్చర్యమనిపించింది. కోట అంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాక కూడా మేము అక్కడి ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కోట జ్ఞాపకం అలాగే నిలిచిపోయింది. - వేదవ్యాస్, ఇ-మెయిల్