బాలీవుడ్ లో భయం భయం | Bollywood stars focus on horror movies | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ లో భయం భయం

Jun 1 2025 2:29 AM | Updated on Jun 1 2025 9:06 AM

Bollywood stars focus on horror movies

హారర్‌ సినిమాలకు మెగ్గు చూపుతున్న బాలీవుడ్‌ స్టార్స్‌

బాలీవుడ్‌లో హారర్‌ సినిమాల హవా కనిపిస్తోంది. గత ఏడాది విడుదలైన హిందీ హారర్‌ చిత్రాలు ‘స్త్రీ 2, భూల్‌ భూలెయ్యా 3, సైతాన్, ముంజ్య’ వంటివి సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఓ విధంగా 2024లో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు హారర్‌ చిత్రాలే వెన్నుదన్నుగా నిలిచాయి. ఇలా హారర్‌ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉందని గమనించిన బాలీవుడ్‌ స్టార్స్‌ వరుసగా ఆ తరహా చిత్రాలకు సైన్‌ చేస్తున్నారు. ఆ హారర్‌ సినిమాల వివరాలపై ఓ లుక్‌ వేద్దాం...

భూత్‌ బంగ్లాలో అక్షయ్‌ కుమార్‌
హీరో అక్షయ్‌ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్‌లది హిట్‌ కాంబినేషన్‌. వీరి కాంబినేషన్‌లో ‘హేరా ఫెరి, గరమ్‌ మసాలా, భూల్‌ భూలెయ్యా’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ 2010లో వచ్చిన ‘ఖట్టా మీఠా’ తర్వాత అక్షయ్‌ కుమార్, ప్రియదర్శన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా అనౌన్స్‌మెంట్‌ రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. గత ఏడాది అక్షయ్‌ కుమార్‌ 57వ బర్త్‌ డే సందర్భంగా ‘భూత్‌ బంగ్లా’ అనే హారర్‌ కామెడీ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.

ఈ సినిమాకు ప్రియదర్శన్‌ దర్శకుడు. హారర్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వామికా గబ్బి, టబు, పరేష్‌ రావల్, జిస్సూ సేన్‌ గు΄్తా ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలుత ఈ హారర్‌ కామెడీ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్‌కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మరి.. హీరో అక్షయ్‌ కుమార్‌–దర్శకుడు ప్రియదర్శన్‌ కాంబినేషన్‌ మరోసారి హిట్‌ అవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

పోలీస్‌ స్టేషన్‌లో భూతం
హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్‌... ఇలా డిఫరెంట్‌ జానర్స్‌లో సినిమాలు చేశారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అయితే హారర్‌ కామెడీ జానర్‌లో మాత్రం ఆయన సినిమా చేయలేదు. ఈ జానర్‌లోనూ తన సత్తా నిరూపించుకోవాలనిపోలీస్‌స్టేషన్‌ మే భూత్‌’ అనే సినిమాను ప్రకటించారు రామ్‌గోపాల్‌ వర్మ. ‘యూ కాంట్‌ కిల్‌ ది డెడ్‌’ అనేది ఈ సినిమా క్యాప్షన్‌. ఈ చిత్రంలో మనోజ్‌ భాజ్‌పేయి లీడ్‌ రోల్‌ చేస్తారు. ‘మనకు భయం వేస్తేపోలీస్‌స్టేషన్‌కు వెళ్తాం. అదేపోలీసులకే భయం వేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్తారు?’ అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్‌. ‘‘ఓపోలీస్‌స్టేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరుగుతుంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్స్‌ దెయ్యాలుగా మారి,పోలీసులను ఇబ్బందిపెడితే ఎలా ఉంటుంది? అన్నపాయింట్‌ ఆఫ్‌ వ్యూలో పోలీస్‌ స్టేషన్‌ మే భూత్‌’ సినిమా కాన్సెప్ట్‌ ఉంటుంది. హారర్‌ కామెడీ జానర్‌లోనే ఈ సినిమా ఉంటుంది’’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో షూటింగ్‌ ఆరంభించాలనుకుంటున్నారు. ‘సత్య’ (1998), ‘కౌన్‌’ (1999), ‘శూల్‌’ (1999) వంటి చిత్రాల తర్వాత దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, హీరో మనోజ్‌ భాజ్‌పేయిపాతిక సంవత్సరాల తర్వాత మళ్లీపోలీస్‌స్టేషన్‌ మే భూత్‌’ సినిమా కోసం కలిసి పని చేస్తుండటం విశేషం.

ప్రేతాత్మతోపోరాటం
భూత, ప్రేతాత్మల నుంచి తన కుమార్తెను కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే అసాధారణపోరాటం నేపథ్యంలో సాగే హిందీ చిత్రం ‘మా’ (తెలుగులో అమ్మ అని అర్థం). కాజోల్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ఈ సినిమాలో రోనిత్‌ డాలీ, ఇంద్రనీల్‌ శుభ్రా, జితిన్‌ జ్యోతీ గులాటి లీడ్‌ రోల్స్‌లో నటించారు. ఈ సీరియస్‌ హారర్‌ సినిమాకు విశాల్‌ రేవంతి ఫ్యూరియా దర్శకత్వం వహించారు.  అజయ్‌ వీణా దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్‌లు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. క్షుద్ర శక్తులు ఓ చిన్నారిని బలి కోరడం, తన కుమార్తె కోసం తల్లి ఓ క్షుద్ర శక్తులతో వీరోచితమైనపోరాటం చేయడం వంటì  సీన్స్‌ ఈ చిత్రం ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి.

హాంటెడ్‌ హౌస్‌
మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘1920’ (2008) సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘1920’ హారర్‌ సిరీస్‌లో వచ్చిన మరికొన్ని హారర్‌ సినిమాలతో అసోసియేట్‌ అయ్యారు విక్రమ్‌ భట్‌. తాజాగా ఆయన డైరెక్షన్‌లోనే ‘హాంటెడ్‌ హౌస్‌ 3డీ: ఘోస్ట్స్‌ ఆఫ్‌ ది ఫాస్ట్‌’ అనే సినిమా రానుంది. ఆనంద్‌ పండిట్, రాకేశ్‌ జునేజా, శ్వేతాంబరి భట్‌ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాలో మహాక్షయ్‌ చక్రవర్తి, టియో బాజ్‌పాయ్, అంచిత్‌ కౌర్, ఆరిఫ్‌ జకారియా ప్రధానపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్‌ చేస్తామన్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. ఇండియన్‌ స్టీరియోస్కోపిక్‌ 3డీ హారర్‌ ఫిల్మ్‌గా ‘హాంటెడ్‌ హౌస్‌ 3డీ: ఘోస్ట్స్‌ ఆఫ్‌ ది ఫాస్ట్‌’ మూవీ రానుంది.

సైతాన్‌ తిరిగి వస్తాడు
గత ఏడాది మార్చిలో థియేటర్స్‌లోకి వచ్చిన ‘సైతాన్‌’ ప్రేక్షకులను బాగా భయపెట్టాడు. అజయ్‌ దేవగన్, ఆర్‌. మాధవన్, జ్యోతిక, జానకి బోడివాలా, అంగద్‌ రాజ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సైతాన్‌’. వికాస్‌ బాల్‌ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది మార్చిలో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను భయపెట్టి, సూపర్‌ హిట్‌ అయింది. ఆ సమయంలోనే ‘సైతాన్‌’ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు అజయ్‌ దేవగన్‌. అయితే ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత అజయ్‌ దేవగన్‌ ‘సైతాన్‌ 2’ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తారని ఊహింవచ్చు.

ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌
ఫారెస్ట్‌లో భయం అంటున్నారు హీరోయిన్‌ తమన్నా. సిద్ధార్థ్‌ మల్హోత్రా, తమన్నా హీరో హీరోయిన్లుగా హిందీలో ‘వ్వాన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ అనే సినిమా రానుంది. హారర్‌ ఎలిమెంట్స్‌తోపాటు మైథలాజికల్‌ అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు అరుణభ్‌ కుమార్‌– దీపక్‌ మిశ్రా ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ మోషన్‌ పిక్చర్స్, ది వైరల్‌ ఫీవర్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ‘వ్వాన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ సినిమా నుంచి తమన్నాపాత్ర తాలూకు ప్రీ టీజర్‌లాంటి ఓ  వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రాత్రివేళ తమన్నా అడవిలోకి వెళ్లడం, అక్కడ ఓ దీపం వెలిగించడం వంటి విజువల్స్‌ ఉన్నాయి. ఇక ఈ సినిమాను 2026లో రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

ప్రేతాత్మగా రష్మిక?
హారర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. ఆయుష్మాన్‌ ఖురానా, రష్మికా మందన్నా లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్‌ ఈ సినిమాకు దర్శకుడు. మడాక్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌ నుంచి రాబోతున్న మరో హారర్‌ చిత్రం ఇది. ఈ సినిమాలో రష్మికా మందన్నా డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారని, ఒకపాత్రలో ఆమె ప్రేతాత్మగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ప్రధానంగా నార్త్‌ ఇండియా లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిందట. ఈ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘థామా’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు.

మరికొన్ని హారర్‌ చిత్రాలు...
మడాక్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌లో భాగంగానే ‘శక్తి శాలిని’, ‘బేడియా 2’, ‘చాముండ’, ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’, ‘పెహ్లా మహాయు«థ్, దూస్‌రా మహాయు«ద్‌’ వంటి సినిమాలను ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మడాక్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌లోని ‘థామా’ సినిమా ఈ ఏడాది దీపావళికి, ఈ ఏడాది డిసెంబరు 31న ‘శక్తి శాలిని’, వచ్చే ఏడాది ఆగస్టు 14న ‘బేడియా 2’, డిసెంబరు 4న ‘చాముండ’ 2027లో ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’ చిత్రాలు, 2028లో ‘పెçహ్లా మహాయు«ద్, దూస్‌రా మహాయు«ద్‌’ సినిమాలు రిలీజ్‌ కానున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించారు.

ఇక వరుణ్‌ ధావన్‌ హీరోగా ‘బేడియా’ ఫ్రాంచైజీ, శ్రద్ధాకపూర్‌–రాజ్‌కుమార్‌ రావు లీడ్‌ రోల్స్‌లో ‘స్త్రీ’ ఫ్రాంచైజీ వెండితెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ‘ముంజ్య’ సినిమాలో అభయ్‌ వర్మ, శర్వారీ లీడ్‌ రోల్స్‌ చేశారు. ఆదిత్య సర్పోత్థార్‌ డైరెక్షన్‌లోని ‘ముంజ్య’ సినిమా 2024లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ తరుణంలో ఈ సినిమా సీక్వెల్‌ ‘మహా ముంజ్య’లో వీరే నటిస్తారా? లేక కొత్త నటీనటులు కనిపిస్తారా? అని తెలియాల్సి ఉంది. ఇంకా ‘శక్తి శాలిని, చాముండ’ వంటి సినిమాల్లో మెయిన్‌ లీడ్‌ రోల్స్‌కు హీరోయిన్స్‌ కియారా అద్వానీ, ఆలియా భట్‌ వంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.      – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement