Video: వరద నీటిలో చిక్కుకున్న జంట.. కారుపై కూర్చొని.. | Couple Rescued In Heavy Rains Flood Water In Gujarat Sabarkantha, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Video: వరద నీటిలో చిక్కుకున్న జంట.. కారుపై కూర్చొని..

Sep 8 2024 7:12 PM | Updated on Sep 9 2024 12:21 PM

Couple Rescued In Flood Water At Gujrat Video Viral

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ జంట నదిలో చిక్కుకుపోవడం తీవ్ర కలకలం సృష్టించింది. అనంతరం, ఎంతో కష్టం మీద వారిద్దరినీ కాపాడారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సంబర్‌కంట ప్రాంతంలో ఓ జంట వరద నీటిలో చిక్కుకున్నారు. కారులో ప్రయాణిస్తోన్న జంట వరద నీటిలో మునిగిపోయింది. కారు కనిపించనంత వరకు వరద వచ్చింది. అతి కష్టంమీద కారు పైభాగానికి చేరుకున్న ఆ జంట.. సాయం కోసం దాదాపు రెండు గంటలపాటు దాంతో బిక్కుబిక్కుమంటూ వేచి చూశారు.

అనంతరం, రంగంలోకి సహాయక బృందాలు వారిని కాపాడగలిగారు. మరికొంత సమయానికే కారు వరదలో కొట్టుకుపోయింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement