లాజిటెక్‌ నుండి డాకింగ్‌ స్టేషన్‌

Logitech Launches Logi Dock All In One Dock Station For Devices - Sakshi

న్యూఢిల్లీ: లాజిటెక్‌ కొత్తగా లాజి డాక్‌ పేరిట ఆల్‌ ఇన్‌ వన్‌ డాకింగ్‌ స్టేషన్‌ను ఆవిష్కరించింది. వివిధ డెస్క్‌టాప్‌ డివైజ్‌లకు ఒకే కనెక్షన్‌ పాయింట్‌గా ఇది ఉపయోగపడుతుంది. అయిదు వరకు యూఎస్‌బీ పెరిఫరల్స్, రెండు వరకూ మానిటర్లతో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను కూడా ఇది సపోర్ట్‌ చేస్తుంది.

గ్రాఫైట్, తెలుపు రంగుల్లో ఇది లభిస్తుంది. దీని ధర రూ. 55,000 (పన్నులు కాకుండా). ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నుండి భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి వస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top