టాటా మోటర్స్‌లో ఎల్‌ఐసీకి 5 శాతం వాటా

Lic Shareholding Crosses 5pc In Tata Motors - Sakshi

గడిచిన పది నెలల్లో వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్‌లో జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) వాటాలు 5 శాతానికి పెరిగాయి. స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సమాచారం ప్రకారం గతేడాది డిసెంబర్‌ 3 నుండి ఈ ఏడాది అక్టోబర్‌ మధ్య కాలంలో ఎల్‌ఐసీ తన షేర్లను 16.59 కోట్ల నుంచి 16.62 కోట్లకు (వాటాలు 4.997 శాతం నుంచి 5.004 శాతానికి) పెంచుకుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి సగటున రూ. 455.69 చొప్పున రూ. 11.39 కోట్లు వెచ్చించింది.

టాటా మోటర్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థలో తమ వాటాలు 5 శాతం దాటితే లిస్టెడ్‌ కంపెనీలు తప్పనిసరిగా స్టాక్‌ ఎక్స్‌చేంజీలకు తెలియజేయాలి. మంగళవారం ఎల్‌ఐసీ షేర్లు స్వల్పంగా పెరిగి రూ. 605 వద్ద, టాటా మోటర్స్‌ షేర్లు 2 శాతం పెరిగి రూ. 421.50 వద్ద ముగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top