
సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు
రూ. 2,150 కోట్ల తాజా ఈక్విటీ జారీ
ఓమ్నిచానల్ ఐవేర్ రిటైలర్ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 13.22 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 273 కోట్లు దేశీయంగా సొంత స్టోర్ల ఏర్పాటు(పెట్టుబడి వ్యయాలు)కు, లీజ్, అద్దె, లైసెన్స్ ఒప్పందాల చెల్లింపులకు రూ. 591.5 కోట్లు, టెక్నాలజీపై రూ. 213.4 కోట్లు, బ్రాండ్ మార్కెటింగ్‌పై మరో రూ. 320 కోట్లు చొప్పున వెచ్చించనుంది.
2008లో షురూ: దేశీయంగా 2008లో ఏర్పాటైన లెన్స్‌కార్ట్.. 2010లో ఆన్‌లైన్ ద్వారా బిజినెస్‌కు తెరతీసింది. 2013లో న్యూఢిల్లీలో తొలి రిటైల్ స్టోర్‌ను తెరిచింది. కంపెనీ ఐవేర్ విభాగంలో డిజైనింగ్, తయారీ, బ్రాండింగ్, రిటైలింగ్‌ను చేపడుతోంది. 2025 మార్చికల్లా దేశీయంగా నెలకొలి్పన 2,067 స్టోర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 2,723 స్టోర్లను నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
రాజస్తాన్‌లోని భివాడీ, హర్యానాలోని గురుగ్రామ్‌లలో ప్లాంట్లు ఉన్నాయి. జాన్ జాకబ్స్, విన్సెంట్ చేజ్, హూపర్ కిడ్స్ తదితర బ్రాండ్లతో బిజినెస్ నిర్వహిస్తోంది. 2024–25లో నష్టాల నుంచి బయటపడి రూ. 297 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 6,652 కోట్లను తాకింది.