జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ ఆఫర్లు | Joyalukkas Announces Exclusive Cash Back Offers For Akshaya Tritiya | Sakshi
Sakshi News home page

జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ ఆఫర్లు

Apr 14 2023 4:42 AM | Updated on Apr 14 2023 7:28 AM

Joyalukkas Announces Exclusive Cash Back Offers For Akshaya Tritiya - Sakshi

హైదరాబాద్‌: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను ఇవ్వనుంది.

అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్‌ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. నేటి నుంచి(14వ తేదీ) ప్రారంభమై ఈ నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ అద్భుతమైన ఆఫర్‌ను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ ఎండీ జాయ్‌ అలుక్కాస్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement