breaking news
gift voucher free
-
ఉద్యోగానికి అప్లయ్ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!
ఏదైనా ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవడం, సంబంధిత సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కామన్. మన ప్రొఫైల్ నచ్చకపోయినా, వారి రిక్వైర్‌మెంట్‌కు తగినట్టుగా లేకపోయినా జాబ్ రాదు. అయితే చాలావరకు ఐటీ కంపెనీలు మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు సారీ అనే మెయిల్స్ కూడా చూశాం. తాజాగా సిలికాన్ వ్యాలీకంపెనీ చేసిన పని ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన కథనం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సిలికాన్ వ్యాలీ-ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సీక్రెట్ సుషీ ఉద్యోగం అప్లయ్ చేసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల ఒక మహిళా ఉద్యోగ అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను పంపింది. దీంతో ఎంత దయగల కంపెనీ అనే ప్రశంసలు దక్కించుకుంది. మేల్విచ్ స్క్వేర్ అనే Reddit వినియోగదారు 'రిక్రూటింగ్హెల్' సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. మేనేజర్ జాబ్‌కోసం ఆమె దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. ఆ తరువాత ప్రతి రోజు, ఆమె తన ఇన్‌బాక్స్‌ను ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా సీక్రెట్ సుషీ నుండి అందుకున్న దరఖాస్తుదారునికి ధన్యవాదాలు తెలుపుతూ, సెలెక్ట్ చేయలేదని చెప్తూనే,గిఫ్ట్ వోచర్ సెండ్చేసింది. ఈ తిరస్కరణ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. దీంతోపాటు తనకొచ్చిన 7 డాలర్లు గిఫ్ట్ వోచర్ ను కూడా షేర్ చేస్తూ.. " మర్చిపోలేని అత్యుత్తమ తిరస్కరణ" అంటూ పోస్ట్‌పెట్టారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. నేటి నుంచి(14వ తేదీ) ప్రారంభమై ఈ నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ అద్భుతమైన ఆఫర్‌ను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ ఎండీ జాయ్ అలుక్కాస్ కోరారు. -
డిస్కౌంట్ల మాయ
సాక్షి, గుంటూరు: ‘సంక్రాంతి పండగ ప్రత్యేక ఆఫర్లు...అన్ని చీరలపైనా ఆకర్షణీయమైన ఆఫర్లు...ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపైనా రూ.200 గిఫ్ట్ ఓచర్ ఉచితం...ఈ ఆఫర్లు మూడు రోజుల వరకే. త్వర పడండి...’ గుంటూరు వస్త్ర వ్యాపారంలో ఆఫర్ల హడావుడి ఇది. పేరున్న ప్రఖ్యాత వస్త్ర దుకాణాలతో పాటు చిన్నచిన్న క్లాత్ షోరూమ్‌లు కూడా పండగ ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి. కొనుగోలుదారుల్ని ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు డిస్కౌంట్ల మాయలో నాసిరకం సరుకును అమ్ముతున్నారు. పల్లెటూళ్ల నుంచి వచ్చే కొనుగోలుదారులు దీన్ని గుర్తించలేక నష్టపోతున్నారు. రూ.10 కోట్ల వ్యాపారం ఏటా సంక్రాంతి పండగకు గుంటూరు మార్కెట్లో సుమారు రూ.10 కోట్ల వస్త్ర వ్యాపారాలు జరుగుతాయి. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువగానే అమ్మకాలు జరుగుతాయని వ్యాపారవర్గాలు అంచనా వేశాయి. రెండు వారాల ముందుగానే పెద్ద మొత్తంలో చీరలు, రెడీమేడ్ డ్రెస్సులు, ఇతరత్రా దిగుమతి చేసుకున్నారు. ఐదో తేదీ నుంచి పండగ కొనుగోళ్లు మొదలయ్యాయి. గుంటూరులోని కొత్తపేట, పాతబస్టాండ్, వాసవీహోల్‌సేల్ క్లాత్ మార్కెట్, బ్రాడీపేట, అరండల్‌పేట, శంకర్‌విలాస్ సెంటర్, లక్ష్మీపురం ప్రాంతాల్లోని పలు వస్త్ర దుకాణాలు పండగ సందర్భంగా 20 నుంచి 40 శాతం డిస్కౌంట్లు ప్రకటించాయి. అన్ని రకాల చీరల కొనుగోళ్లపైనా ఆఫర్లు అంటూ బోర్డులు, కరపత్రాలతో ప్రచారం చేశారు. పట్టు, చందేరీ కాటన్, క్రేప్, నెట్టెడ్, క్రేప్ జార్జెట్, ఫ్యాన్సీ, డిజైన్ శారీస్ అన్నింటికీ వివిధ షాపుల యజమానులు 20 శాతం డిస్కౌంట్లను ప్రకటించారు. వాటికి ప్రత్యేక ధరలతో కూడిన స్టిక్కర్లను అంటించి విక్రయాలు జరుపుతున్నారు. అయితే కొందరు వ్యాపారులు డిస్కౌంట్ల ఎర చూపుతూ డ్యామేజీ సరుకును కూడా విక్రయిస్తున్నారు. వినియోగదారులకు డ్యామేజీలను చూపకుండా తక్కువ ధరకంటూ అంటగడుతున్నారు. స్తంభాలగరువు ప్రాంతానికి చెందిన ఓ మహిళ వాసవీ హోల్‌సేల్ క్లాత్ బజారులో ఉన్న ఓ దుకాణంలో రెండు రోజుల కిందట మూడు రెడీమేడ్ డ్రెస్సులు కొనుగోలు చేసింది. వాటిని ఇంటికెళ్లి పరిశీలించగా డ్యామేజీలు బయటపడ్డాయి. తిరిగి షాపు వద్దకు వెళ్లగా ఆ దుస్తుల్ని వాపసు తీసుకునేందుకు షాపు యజమాని అంగీకరించలేదు. అదేవిధంగా అరండల్‌పేట, బ్రాడీపేట సెంటర్లలోని కొన్ని పేరున్న చీరల దుకాణాలు కూడా డ్యామేజీ చీరల్ని విక్రయిస్తున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ‘కొనేటపుడు ముందే చూసుకోవాలంటూ ఆ షాపుల యజమానులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. పండగ హడావుడిలో ధర కుదుర్చుకోవడంలో మునిగిపోతున్న కొనుగోలుదారులు వస్త్రాలన్నింటినీ పూర్తిగా విప్పదీసి చూసుకోవడం సాధ్యం కాని పని. దీన్ని వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్న కొందరు వ్యాపారులు క్రిస్మస్ పండగ నుంచి అమ్ముడుపోని పాత సరుకును తాజాగా డిస్కౌంట్ల మాయలో విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించకపోతే నష్టపోవడం ఖాయం.