Jio Institute Appoints Dr. Guruswami Ravichandran as Provost - Sakshi
Sakshi News home page

జియో ఇన్‌స్టిట్యూట్స్‌ హెడ్‌గా గురుస్వామి రవిచంద్రన్‌

Apr 5 2022 1:06 PM | Updated on Apr 5 2022 1:17 PM

Jio Institute appoints Doctor Guruswami Ravichandran as the Provost - Sakshi

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జియో ఇన్‌స్టిట్యూట్స్‌కి హెడ్‌గా గురుస్వామి రవిచంద్రన్‌ను నియమిస్తున్నట్టు రిలయన్స​ ప్రకటించింది. 2022 జులై 1న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళాకి చెందిన గురుస్వామి తిరుచ్చి ఆర్‌ఈసీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో బ్రౌన్‌ యూనివర్సిటీలో ఎమ్మె‍స్‌ పూర్తి చేసి అక్కడే పీహెచ్‌డీ పట్టా కూడా పొందారు. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన అనేక ఇంజనీరింగ్‌ సంస్థలలో ఆయన పని చేశారు. గురుస్వామి నియామకం పట్ల రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. గురుస్వామి నిర్దేశంలో జియో ఇన్‌స్టిట్యూట్‌ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement