నష్టాల్లోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ | Jet Airways Loss To Over Rs 308 Cr In Q2 | Sakshi
Sakshi News home page

నష్టాల్లోనే జెట్‌ ఎయిర్‌వేస్‌

Published Sat, Nov 12 2022 8:35 AM | Last Updated on Sat, Nov 12 2022 8:35 AM

Jet Airways Loss To Over Rs 308 Cr In Q2 - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ విమానయాన కంపెనీ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 308 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 306 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. స్టాండెలోన్‌ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 45 కోట్ల నుంచి 13.5 కోట్లకు పడిపోయింది.

మొత్తం వ్యయాలు రూ. 322 కోట్లకు చేరాయి. మూడున్నరేళ్లుగా కార్యకలాపాలు నిలిచిపోయిన కంపెనీ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను గెలుపొందింది. అయితే కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావలసి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement