
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2024–25 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలు.. ఐటీఆర్ 2, 3, 5ను నోటిఫై చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీబీడీటీ ప్రకటించింది.
పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా రిటర్నుల పత్రాల్లో మార్పులు చేశారు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది.