ఫోన్‌లో ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు

Irctc Warning For All Android Smartphone Users - Sakshi

రైల్వే ప్రయాణికుల్ని ఐఆర్‌సీటీసీ అప్రమత్తం చేసింది. irctcconnect.apk పేరుతో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సలహా ఇచ్చింది. 

ఇండియన్‌ రైల్వే పేరుతో ఓ ఫేక్‌ యాప్‌ మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌, టెలిగ్రాంలలో ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన ఐఆర్‌సీటీసీ అధికారులు.. సర్క్యులేట్‌ అవుతున్న ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని తెలిపారు.

సైబర్‌ నేరస్తులు ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కుతున్నారని, వినియోగదారులు వ్యక్తిగత యూపీఐ, క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ బ్యాంకింగ్‌ వివరాల్ని సేకరించి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు సూచించింది. కాబట్టి యూజర్లు ఇలాంటి యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ యాప్స్‌నే డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్లు, యాప్స్‌ను పోలి ఉండేలా సైబర్‌ నేరస్తులు ఫేక్‌ వెబ్‌సైట్లు, యాప్స్‌ను తయారు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలగకుండా ఈ యాప్‌తో కూడిన మోసపూరిత లింక్‌ (ఫిషింగ్‌ అటాక్‌)లను ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకునేవారికి సెండ్‌ చేస్తున్నారు. పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే ..ఫిషింగ్ దాడికి గురైన బాధితుల నుండి యూపీఐ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారంతో సహా సున్నితమైన నెట్ బ్యాంకింగ్ వివరాల్ని దొంగిలిస్తున్నారు.

ఇక నేరస్తులు ఐఆర్‌సీటీసీ పేరుతో షేర్‌ చేస్తున్న లింక్‌లతో యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐఆర్‌సీటీసీ అఫిషియల్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ వంటి మొబైల్‌ యాప్స్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లేస్టోర్‌ల నుంచి మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top