ట్రైన్ టికెట్ బుకింగ్స్ అక్కడే ఎక్కువ! | IRCTC Big Revelation 28 Percent of Railway Tickets Booked Through Third Party Platforms | Sakshi
Sakshi News home page

ట్రైన్ టికెట్ బుకింగ్స్ అక్కడే ఎక్కువ.. IRCTC కీలక ప్రకటన!

Sep 8 2026 4:36 PM | Updated on Sep 8 2026 5:20 PM

IRCTC Big Revelation 28 Percent of Railway Tickets Booked Through Third Party Platforms

భారతదేశంలో రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో ఐఆర్‌సీటీసీతో పాటు పేటిఎం, మేక్‌మైట్రిప్, ఇక్సిగో, కన్‌ఫర్మ్ టికెట్ వంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బుక్ అయ్యే రైల్వే టికెట్లలో దాదాపు 28 శాతం టికెట్లు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బుక్ అవుతున్నాయని ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ హిమాలియన్ తెలిపారు.

89 శాతం ఆన్‌లైన్‌లోనే
ప్రస్తుతం దేశంలో బుక్ అయ్యే రైల్వే టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయి. ఇందులో 53 శాతం టికెట్లు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్ ద్వారా బుక్ అవుతుండగా, మరో 17 శాతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ అవుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన బుకింగ్ వ్యవస్థల ద్వారా సుమారు 2 శాతం టికెట్లు బుక్ అవుతున్నాయి. మిగిలిన 28 శాతం టికెట్లు ఐఆర్‌సీటీసీ బిజినెస్ అసోసియేట్స్ ద్వారా బుక్ అవుతున్నాయి.

పేటిఎం వాటా ఎంత?
ఇక్కడ 28 శాతం అనేది కేవలం పేటిఎం వాటా మాత్రమే కాదు. ఈ సంఖ్యలో ఐఆర్‌సీటీసీతో భాగస్వామ్యం ఉన్న అన్ని థర్డ్ పార్టీ సంస్థల బుకింగ్స్ ఉన్నాయి. ఇందులో మేక్‌మైట్రిప్, ఇక్సిగో, కన్‌ఫర్మ్ టికెట్ ఉన్నాయి. అయితే వీటిలో ఒక్కో సంస్థకు ఎంత వాటా ఉందనే వివరాలను ఐఆర్‌సీటీసీ వెల్లడించలేదు.

రోజుకు 19 లక్షల బుకింగ్స్
దేశంలో రోజుకు సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల రైల్వే టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇందులో దాదాపు 14.88 లక్షల నుంచి 15 లక్షల వరకు టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిరోజూ టికెట్లు బుక్ అవుతుండటంతో.. రైల్వే ప్రయాణం భారతదేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ కేటగిరీల్లో ఒకటిగా ఉంది.

ఐఆర్‌సీటీసీ కేవలం రైల్వే టికెట్ల బుకింగ్‌కే పరిమితం కాకుండా.. మరిన్ని ట్రావెల్ సేవలను అందించాలని చూస్తోంది. హోటల్ బుకింగ్, టూరిజం, ఇన్సూరెన్స్, ఫుడ్, క్యాబ్‌లు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వంటి సేవలను కూడా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందించే దిశగా ఐఆర్‌సీటీసీ ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

ఇదీ చదవండి: జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement