ఐఫోన్‌13 పై ఆఫర్‌ మామూలుగా లేదుగా,నెలకు రూ.760కే..అస్సలు మిస్‌ చేసుకోవద్దు!

Iphone 13 Available At Just Rs 760 Per Month How To Get Apple Smartphone  - Sakshi

ఐఫోన్‌ కొనడం కొందరికి అందని ద్రాక్షనే. ఎందుకంటే ఆ ఫోన్‌ ఖరీదు ఎక్కువ. కాకపోతే ఇతర ఫోన్‌లతో పోలిస్తే లుకింగ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్‌లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే ఖరీదైనా సరే ఆ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌13 పై అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది.  

అమెరికాకు చెందిన వైర్‌లెస్‌ నెట్‌ వర్క్‌ ఆపరేటర్‌ (జియో టైప్‌) వెరిజోన్‌ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.నెలకు ఈఎంఐ రూ.760 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. యాపిల్‌కు చెందిన ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌-13 వరల్డ్‌ వైడ్‌గా హాట్‌ కేకుల్లా అమ్ముడవతున్న ఫోన్‌.

తాజాగా ఈ ఫోన్‌లో యాపిల్‌ సంస్థ ఏ15 బయోనిక్‌ చిప్‌, గ్రీన్‌ గ్రీన్ ఫినిషెస్ తో డిజైన్‌ చేసిన ఐఫోన్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్‌ను వెరిజోన్‌ సంస్థ నెలకు 10డాలర్లు (భారత్‌ కరెన్సీలో రూ.760) చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

 

నెలకు 10 డాలర్లు, 36 నెలలు 
వెరిజోన్‌ సంస్థ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెరికన్‌లు నెలకు 10 డాలర్లను సుమారు 36నెలలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ఫోన్‌ ధర ప్రస్తుత మార్కెట్‌లో 699డాలర్లు (భారత్‌ కరెన్సీలో రూ.53,355.79) ఉండగా, ఈ ఆఫర్‌ దక్కించుకున్న యూజర్లకు 360 డాలర్లు  (భారత్‌ కరెన్సీలో రూ.27,479.38) కే పొందవచ్చు.

చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్‌13తో కళ్లకు ట్రీట్మెంట్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top