యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ భారీ షాక్‌! మరి నెక్ట్స్​ ఏంటీ?..ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడమే

Instagram Is Shutting Down Separate Igtv App For Long Form Videos - Sakshi

ప్రముఖ ఫోటో షేరింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు భారీ షాకిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ టీవీ (ఐజీటీవీ)ని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కంపెనీ పూర్తిస్థాయిలో వీడియో కంటెంట్‌ మీదనే దృష్టిసారిస్తున్నట్లు పేర్కొంది. 

టెక్‌ మార్కెట్‌లో యూట్యూబ్‌ నుంచి వస్తున్న కాంపిటీషన్‌ ను తట్టుకునేందుకు 2018లో వీడియోస్‌కోసం ఇన్‌స‍్టా గ్రామ్‌ టీవీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.  కానీ ఆ యాప్‌ యూజర్లను అట్రాక్ట్‌ చేయడంలో ఆకట్టుకోలేకపోయింది. ​దీంతో ఇప్పుడు ఐజీటీవీని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు తెలిపింది.  

ఈ సందర్భంగా ఇన్‌స్టా గ్రామ్ తన బ్లాగ్పోస్ట్‌లో కంపెనీకి చెందిన ఐజీటీవీ యాప్‌ను తొలగిస్తున్నట్లు పేర్కొంది. సింపుల్‌గా సాధ్యమయ్యేలా వీడియోలను తయారు చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాన యాప్‌లోనే వీడియో కంటెంట్‌ను అందిస్తున్నట్లు చెప్పింది. ట్యాప్ టు మ్యూట్‌తో కంప్లీట్‌ స్క్రీన్ లో వీడియోలు చూసే పద్దతిని మరింత సులభతరం చేయడానికి కంపెనీ పని చేస్తుందని బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. 

మరోవైపు  రీల్స్‌ చేసే క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. ఇన్‌స్టా గ్రామ్ రీల్స్‌లో యాడ్స్‌ వచ్చేలా ప్లాన్‌ చేస్తుంది. తద్వారా క్రియేటర్లు డబ్బులు సంపాదించే అవకాశం రానుంది. కాగా ఇన్‌స్టా గ్రామ్‌ ఐజీటీవీని మార్చి నెలలో షట్‌ డౌన్‌ చేస్తున్నట్లు టెక్‌ బ్లాగ్‌ టెక్‌ క్రంచ్‌ తెలిపింది.

చదవండి: చెల‌రేగిపోదాం! టిక్ టాక్‌ను త‌ల‌ద‌న్నేలా..ఫేస్‌బుక్‌తో డ‌బ్బులు సంపాదించండిలా?!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top