చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే.. | Inside Trisha Krishnan's Chennai Home Tradition Modern Design Simplicity | Sakshi
Sakshi News home page

చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే..

Apr 25 2026 7:28 AM | Updated on Apr 25 2026 8:46 AM

Inside Trisha Krishnan's Chennai Home Tradition Modern Design Simplicity

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో రెండు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసి సౌత్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు నటి త్రిష కృష్ణన్. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ నిత్యం వెలుగు జిలుగుల మధ్య గడిపే సెలబ్రిటీల ఇళ్లు అంటే సాధారణంగా ఆడంబరాలకు నిలయంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, చెన్నైలోని త్రిష నివాసం ఇందుకు భిన్నం. ఆడంబరం కంటే అభిరుచికి, ప్రదర్శన కంటే ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ ఆమె తీర్చిదిద్దుకున్న ఈ ఇల్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చెన్నైలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన తైనాంపేటలోని సెనోటాఫ్ రోడ్‌లో త్రిష నివాసం ఉంది. నగరంలోని వీవీఐపీలు, ఉన్నతాధికారులు నివసించే ఈ ప్రాంతం భద్రతకు, గోప్యతకు మారుపేరు. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా మలుచుకున్నారు. త్రిష నివాసంలో ప్రతి మూలా ఆమె అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఇంటి లోపల వాడిన రంగులు, అలంకరణ సామాగ్రి కళ్లకు ఇంపుగా ఉంటాయి. దక్షిణ భారత సంప్రదాయ కట్టడాల శైలిని విస్మరించకుండానే ఆధునిక ఆర్కిటెక్చర్‌ను ఇందులో జోడించారు. పెద్ద కిటికీలు సహజ సిద్ధమైన వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేస్తూ ఒక హైబ్రిడ్ లుక్ ఇస్తున్నాయి. భారీ అలంకరణల కంటే, కంఫర్ట్‌కే ప్రాధాన్యం ఇస్తూ గదులను డిజైన్ చేశారు.

గతంలో ఈ ఇల్లు కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వల్ల పోలీసులు ఇక్కడ సోదాలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలాంటి ఆటంకాలు ఎదురైనా తన వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా త్రిష జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Advertisement
 
Advertisement
Advertisement