రూ.6,000 కోట్ల డీల్‌: ఐనాక్స్‌ క్లీన్‌ చేతికి వేనా ఎనర్జీ | inox clean energy acquires vena energy india rs 6000 crore deal | Sakshi
Sakshi News home page

రూ.6,000 కోట్ల డీల్‌: ఐనాక్స్‌ క్లీన్‌ చేతికి వేనా ఎనర్జీ

Jun 5 2026 3:30 PM | Updated on Jun 5 2026 3:37 PM

inox clean energy acquires vena energy india rs 6000 crore deal

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ తాజాగా వేనా ఎనర్జీ ఇండియా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వా రా 6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకోనుంది. సంబంధిత వర్గాల అంచనా ప్రకారం ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లుకాగా.. వేనా ప్రస్తుతం 1.2 గిగావాట్ల నిర్వహణలోని ఇంధన ఆస్తులతోపాటు.. త్వరలో ప్రారంభంకానున్న చివరి దశ అభివృద్ధిలోని 1.8 గిగావాట్ల ప్రాజెక్టులను కలిగి ఉంది.

వీటికి జతగా మరో 3 గిగావాట్ల అభివృద్ధి దశ ప్రాజెక్టులు సైతం ఉన్నట్లు ఐనాక్స్‌ క్లీన్‌ వెల్లడించింది. అంతేకాకుండా విద్యుత్‌ కొనుగోలుకి సోలార్‌ ఎస్‌ఈసీఐ, గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగమ్‌ తదితర వా ణిజ్య, పారిశ్రామిక క్లయింట్లుసహా.. ప్రభుత్వ రంగ పంపిణీ సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement