ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం బంద్‌! | Indo Bangla Trade Halted Amid Unrest | Sakshi
Sakshi News home page

ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం బంద్‌!

Aug 5 2024 8:53 PM | Updated on Aug 6 2024 9:04 AM

Indo Bangla Trade Halted Amid Unrest

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం సోమవారం మధ్యాహ్నం నిలిచిపోయింది. ఆ దేశంలో హింసాత్మక నిరసనల ఫలితంగా అధ్యక్షురాలు షేక్ హసీనా రాజీనామా చేశారు.

దేశంలో అత్యవసర సేవలు మినహా మూడు రోజుల వాణిజ్య సెలవును ప్రకటిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.  బంగ్లాదేశ్ కస్టమ్స్ నుంచి తమ ల్యాండ్ పోర్ట్‌లలో క్లియరెన్స్ లేకపోవడంతో, అన్ని ల్యాండ్ పోర్ట్‌లలో ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్ ఎగుమతిదారుల సమన్వయ కమిటీ కార్యదర్శి ఉజ్జల్ సాహా తెలిపారు.

గత రెండు రోజులుగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. హసీనా సోమవారం రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. సోమవారం ఉదయం కొంత మేర వాణిజ్య కార్యకలాపాలు జరిగినా అధ్యక్షురాలి రాజీనామా, దేశం నుంచి నిష్క్రమణ వార్తల తర్వాత ఆగిపోయిందని బెనాపోల్ సి&ఎఫ్ స్టాఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాజేదుర్ రెహ్మాన్ చెప్పారు.

బెనాపోల్ పశ్చిమ బెంగాల్‌లోని పెట్రాపోల్ సరిహద్దులో బంగ్లాదేశ్ వైపు ఉంది. రాష్ట్రంలోని కొన్ని ఇతర ల్యాండ్ పోర్ట్‌లలో అత్యధికంగా ద్వైపాక్షిక వాణిజ్యానికి కారణమయ్యే అతిపెద్ద ల్యాండ్ పోర్ట్ అయిన పెట్రాపోల్ కూడా ప్రభావితమైందని వ్యాపార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement