భారతీయ ఐటీ కంపెనీ సంచలనం.. ఓనర్లుగా ఉద్యోగులు! | Sakshi
Sakshi News home page

భారతీయ ఐటీ కంపెనీ సంచలనం.. ఓనర్లుగా ఉద్యోగులు!

Published Wed, Jan 3 2024 5:48 PM

Indian Tech firm gives away 33 percent ownership to staff - Sakshi

నెలకోసారి జీతమిచ్చే కంపెనీలే కానీ ఆదాయంలో వాటా ఇచ్చే సంస్థల గురించి అరుదుగా వింటుంటాం. అలాంటిదే ఈ భారతీయ ఐటీ కంపెనీ. తమ ఉద్యోగులకు కంపెనీలో ఏకంగా 33 శాతం వాటాను ఇచ్చేస్తోంది. అంతేకాదు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల విలువైన కార్లు అందించింది. కంపెనీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులనైతే ‘కో ఫౌండర్లు’గా ప్రకటించేసింది.

33 శాతం ఉద్యోగులకే.. 
ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకున్న ఈ ఐటీ కంపెనీ పేరు ‘ఐడియాస్‌2ఐటీ’ (Ideas2IT) భారత్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ టెక్ సంస్థ తమ 100 మిలియన్‌ డాలర్ల ( సుమారు రూ.832 కోట్లు) కంపెనీ యాజమాన్యంలో 33 శాతాన్ని ఉద్యోగులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 5 శాతాన్ని 2009లో కంపెనీ పెట్టినప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్న 40 ఉద్యోగులకు, మిగిలినదాన్ని మిగతా 700 మంది సిబ్బందికి పంచనున్నట్లు పేర్కొంది.

 

150 మందికి కార్లు
కంపెనీలో వాటాతో పాటు తమ వద్ద ఐదేళ్లకు పైగా సేవలందించిన 50 మంది ఉద్యోగులకు 50 కార్లను కంపెనీ వ్యవస్థాపకులు మురళీ వివేకానందన్‌, భవాని రామన్‌ అందజేశారు. ఉద్యోగులు రూ. 8-15 లక్షల ధర రేంజ్‌లో మారుతీ సుజుకి లైనప్ నుంచి తమకు నచ్చిన వాహనాలను ఎంచుకోవడానికి కంపెనీ అవకాశం కల్పించింది. అంతేకాదు.. ఉద్యోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా వీటిని వారి సొంత పేర్లతో రిజిస్టర్ చేసి మరీ ఇచ్చింది. కాగా ఇదివరకే 2022లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇలాగే 100 కార్లను అందించింది.

సామాన్య యువతకు అవకాశం
2009లో ప్రారంభించి 100 మిలియన్‌ డాలర్ల సంస్థగా ఎదిగామని, దీని ఫలాలను తమ ఉద్యోగులతో పంచుకోవాలకోవాలనుకుంటున్నట్లు ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు మురళీ వివేకానందన్ వెల్లడించినట్లుగా వార్తాసంస్థ వియాన్‌ పేర్కొంది. ఎంప్లాయీ ఓనర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ చొరవలో భాగంగా కంపెనీ దీన్ని చేపట్టింది. ఈ కంపెనీకి భారత్‌తోపాటు యూఎస్‌, మెక్సికో దేశాల్లో మొత్తం 750 మంది ఉద్యోగులు ఉన్నారు.  మరో విశేషం ఏటంటే ఈ కంపెనీ ఉద్యోగుల కోసం ఐఐటీల వెంట పడదు. చిన్న చిన్న పట్టణాలకు చెందిన సామాన్య యువతనే నియమించుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కంపెనీ విలువను నాలుగు సంవత్సరాల వ్యవధిలో మూడు రెట్లు పెంచే వ్యూహంతో ఉన్న చెప్పిన మురళీ వివేకానందన్ కంపెనీ ప్రారంభించడదానికి ముందు సన్, ఒరాకిల్, గూగుల్‌ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం యూఎస్‌ ఉంటున్న ఆయన భారత్‌లోని చెన్నై, మెక్సికో మధ్య తిరుగుతూ ఉంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement