2 నెలల జీతం ఇస్తాం..ఆఫీస్‌కు రావొద్దు..వందల మందిని తొలగించిన మరో సంస్థ!

Indian Startup Healthifyme Laid Off 150 Employees - Sakshi

అదిగో..! ఆర్ధిక మాంద్యం వచ్చేస్తోంది. సంపాదించిన డబ్బుల‍్ని ఖర్చు చేయకండి. దాచుకోండి అంటూ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ భవిష్యత్‌పై జోస్యం చెప్పారు. అప్పటి దాకా రెసిషన్‌ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో తెలియని ఉద్యోగులు సైతం..జనాలతో డబ్బులు ఖర్చు పెట్టించే బిజినెస్‌ చేస్తున్న బెజోస్‌ ఇలా మాట్లాడడం ఏంటోనని ముక్కున వేలేసుకున్నారు.

కానీ మాంద్యం వస్తుందని ప్రచారం ఊపందుకునే లోపే చిన్నా చితకా కంపెనీల నుంచి స్టార్టప్‌లు, దిగ్గజ సంస్థలు మాంద్యం ప్రభావం గట్టిగానే ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. విధుల నుంచి పీకేస్తున్నాయి.

ఇప్పటికే అమెజాన్‌ భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో దేశీయ స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగుల్ని ఫైర్‌ చేసింది. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా సంస్థలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పటికే నవంబర్‌ 17న న్యూయార్క్‌ టైమ్స్‌(ఎన్‌వైటీ) కు అమెజాన్‌ సీఈవో ఆండీ మెస్సీ భారీ లేఫ్స్‌ ఉంటాయని, కానీ ఎంతమందిపై వేటు వేస్తారనే విషయంపై స్పష్టత ఇ‍వ్వలేదు.

ఎన్‌వైటీ తన నివేదికలో..అందుకు ఊతం ఇచ్చేలా అమెజాన్‌ లెవల్‌ 1 నుంచి  లెవల్‌ 7 ర్యాంక్‌ ఉద్యోగుల్ని ఫైర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కోల్పోనున్నారు.   

ఉద్యోగుల్ని తొలగిస్తున్న అమెజాన్‌ దిగ్గజ కంపెనీల బాటలో  భార‌త టెక్ స్టార్ట‌ప్ హెల్తిఫైమి తన మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో 150 మందిని తొల‌గించింది. ప్రొడక్ట్‌, క్వాలిటీ కంట్రోల్‌ , మ్యాట‌ర్ ఎక్స్‌ప‌ర్ట్స్‌, మార్కెటింగ్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది.

ఫైర్‌ చేసిన ఉద్యోగులకు నష్టపరిహారంగా రెండు నెల‌ల జీతం,కౌన్సెలింగ్‌, అవుట్‌ప్లేస్‌మెంట్ తో పాటు ఇతర బెన్ఫిట్స్‌ అందిస్తామంటూ ఉద్యోగులకు సర్ధి చెప్పింది.

చదవండి👉  ప్చ్‌, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top