కాసుల వర్షం కురిపించనున్న ఓటీటీ

India Video OTT Market To Hit 12 5 Billion Dollars in 2030 - Sakshi

కరోనా మహమ్మారి పుణ్యమా అని ఓటీటీకి కాసుల వర్షం కురుస్తుంది. లాక్ డౌన్ కాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అయ్యాయి. కోవిడ్-19 వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకి భాగ పెరగిపోయింది. దీంతో ఓటీటీ మార్కెట్ కూడా శర వేగంగా విస్తరించింది. మొబైల్ నెట్ వర్క్ సామర్ధ్యం పెరగడం, డిజిటల్ కనెక్టివిటీని యాక్సెస్ చేసుకునే వారి సంఖ్య పెరగడం వల్ల ఓటీటీ మార్కెట్ విలువ 2021లో సుమారు 1.5 బిలియన్ డాలర్ల(రూ.11 వేల కోట్లు)కు చేరుకుంది.

మన దేశంలో వీడియో ఓటీటీ మార్కెట్ విలువ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ.లక్ష కోట్ల)ను తాకే అవకాశం ఉన్నట్లు ఆర్ బీఎస్ఏ అడ్వైజర్స్ నివేదిక తెలిపింది. ఓటీటీ మార్కెట్ మెట్రో పట్టణాల నుంచి చిన్న చిన్న నగరాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. రోజు రోజుకి స్థానిక భాషలకు చెందిన కంటెంట్ కు డిమాండ్ పెరగడం వల్ల ఓటీటీ మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. వీరిలో వూట్, హిరోస్ నౌ, సోనీలివ్, జీ5, హోయిచోయ్, ఆల్ట్ బాలాజీ, అడ్డటైమ్స్ స్థానిక ఓటీటీ కంపెనీలు పోటీపడుతున్నాయి.

భారతదేశంలో ఓటిటి ప్లాట్ ఫారమ్ లు రోజువారీగా చందాదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో టాప్ ఫేవరేట్స్ అయిన డిస్నీ+ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ మాత్రమే కాకుండా స్థానిక లేదా ప్రాంతీయ భాషలకు చెందిన సంస్థలు కూడా వృద్దిని కనబరుస్తున్నాయి. భారతదేశంలో భారతీయ వీడియో ఓటిటి మార్కెట్ 2021లో 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2025లో 4 బిలియన్ డాలర్లకు ఆ తర్వాత 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్ బీఎస్ఏ అడ్వైజర్స్ నివేదిక పేర్కొంది. రాబోయే నాలుగు ఏళ్లలో ఓటీటీ సామ్రాజ్యం వేగంగా విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయిని పేర్కొంది. రాబోయే ఏళ్లలో ఓటీటీ మార్కెట్ కాసుల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top