స్మగ్లింగ్‌ కట్టడికి భారత్‌ నాయకత్వం వహించాలి | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్‌ కట్టడికి భారత్‌ నాయకత్వం వహించాలి

Published Sat, Jan 28 2023 3:58 AM

India should lead global campaign against smuggling - Sakshi

న్యూఢిల్లీ: వస్తు అక్రమ రవాణా (స్మగ్లింగ్‌) కారణంగా నష్టపోతున్న భారత్‌ దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ‘థింక్‌ చేంజ్‌ ఫోరమ్‌’ అనే సంస్థ ఓ నివేదికలో సూచించింది. ఈ విధమైన అక్రమ వాణిజ్య విధానాలను నిరోధించడం వల్ల ఏటా 31 బిలియన్‌ డాలర్లు (రూ.2.54 లక్షల కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు ఆదా అవుతుందని పేర్కొంది. అంతేకాదు, ఏటా 1,64,000 (2030 నుంచి) ముందస్తు మరణాలను కూడా అరికట్టొచ్చని సూచించింది. ఈ మరణాల్లో అధిక భాగం తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది.

స్మగుల్డ్‌ ఉత్పత్తులను వినియోగించే పెద్ద మార్కెట్ల లో భారత్‌ కూడా ఉందంటూ.. దీని వల్ల ఏటా పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోతున్నట్టు వివరించింది. అందుకే ఈ విషయంలో భారత్‌ ప్రపంచంలో నా యకత్వ పాత్ర  పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. అతి పెద్ద వినియోగ దేశమైన భారత్‌దు చిట్ట విరుద్ధమైన ఉత్పత్తుల వల్ల నష్టపోతోందని, అంతర్జాతీయంగా దీనిపై సమన్వయానికి ముందుకు రావాలని కోరింది. ఒక్క పొగాకు ఉత్పత్తుల దొంగ రవాణా వల్ల ప్రపంచ దేశాలు ఏటా 40.5 బిలియన్‌ డాలర్లు (రూ.3.32 లక్షల కోట్లు) నష్టపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.  

కలసికట్టుగా పోరాడాలి..
అంతర్జాతీయంగా స్మగుల్డ్‌ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని థింక్‌ చేంజ్‌ ఫోరమ్‌ సంస్థ సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తు అక్రమ రవాణా పెద్ద సవాలుగా ఉన్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ బ్రాండ్లు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉన్నాయని, ఇవి స్మగుల్డ్‌ కంటే నకిలీ ఉత్పత్తుల సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది.

‘‘స్మగ్లింగ్‌ అనేది వినియోగ దేశం ఆదాయ నష్టపోవడానికి కారణమవుతుంది. అంతర్జాతీయ బ్రాండ్‌ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి. స్మగుల్డ్‌ రూపంలో వినియోగదారులకు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కనుక స్మగ్లింగ్‌ అంశంపై భారత్‌ అంతర్జాతీయంగా ఏకాభిప్రాయానికి కృషి చేయాలి’’అని ఈ నివేదిక సూచించింది. అంతర్జాతీయ వేదికపై స్మగ్లింగ్‌ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారత్‌ వర్ధమాన దేశాల స్వరాన్ని వినిపించొచ్చని, ప్రపంచ నేతగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది.

బ్రాండెడ్‌ ఉత్పత్తులు అక్రమ మార్గాల్లో భారత్‌లోకి వస్తే ఆయా ఉత్పత్తుల కంపెనీల యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఈ ఫోరమ్‌ సూచించింది. ‘‘ఆయా బ్రాండ్‌ యజమానాలను కార్పొరేట్‌ శాఖ శిక్ష విధించాలి. అంతర్జాతీయంగా ఇదొక దురాచారంగా మారింది. పేరొందిన బ్రాండ్లు  అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాల్లో తక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. సబ్సిడరీ ద్వారా నేరుగా భారత్‌లోకి దిగు మతి చేసుకోకుండా, అవి అంతర్జాతీయ ట్రేడ ర్లు, పంపిణీదారులకు విక్రయిస్తున్నాయి. వారి నుంచి అక్రమ మార్గాల్లో ఉత్పత్తులు అనధికారిక మార్కెట్ల ను చేరుతున్నాయి’’అని నివేదిక పేర్కొంది.

Advertisement
 
Advertisement