
2047 నాటికి భారతదేశం సూపర్ పవర్‌గా అవతరిస్తుంది, అయితే అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారదని ఫైనాన్షియల్ టైమ్స్ చీఫ్ ఎకనామిక్స్ వ్యాఖ్యాత మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌గా అవరిస్తుందన్న ప్రధాని మోదీ కల నెరవేరడం అసాధ్యమని ఆయన అన్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మార్టిన్ వోల్ఫ్ మాట్లాడుతూ.. గ్లోబల్ మార్కెట్ల వృద్ధి నెమ్మదిగా ఉండటం మాత్రమే కాకుండా, బలహీన ఆర్థిక వ్యవస్థల కారణంగా భారతదేశ ఎదుగుదల కష్టతరం అవుతుందని అన్నారు. కానీ ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తాయని.. అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటే.. ఆ తరువాత భారత్ ఆర్థికంగా కూడా ఎదుగుతుందని ఆయన అన్నారు.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. దీనికోసం కేంద్రం విజన్ డాక్యుమెంట్‌పై పని చేస్తోంది. ఇండియా అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారటానికి ప్రతి వ్యక్తి జీడీపీ సంవత్సరానికి 7.5 శాతానికి చేరుకోవాలి. అప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని వోల్ఫ్ అన్నారు.