మేలో ‘తయారీ’ పటిష్టం | Sakshi
Sakshi News home page

మేలో ‘తయారీ’ పటిష్టం

Published Fri, Jun 2 2023 3:49 AM

India manufacturing PMI hits 31-month high in May - Sakshi

న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పురోగతిని కనబరిచినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్ధ్‌ (పీఎంఐ) స్పష్టం చేసింది. సూచీ 31 నెలల గరిష్ట స్థాయిలో 58.7కు చేరినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా పేర్కొన్నారు.

ఏప్రిల్‌లో సూచీ 57.2 వద్ద ఉంది. నిజానికి సూచీ 50పైన వుంటే వృద్ధి ధోరణిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50 పైన కొనసాగడం వరుసగా 23వ నెల కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement