వాహన ఎగుమతులు పెరిగాయ్‌ | India Increased Vehicle Exports During April-June This Year Were 14,19,430 Vehicles | Sakshi
Sakshi News home page

వాహన ఎగుమతులు పెరిగాయ్‌

Jul 19 2021 12:23 AM | Updated on Jul 19 2021 12:24 AM

India Increased Vehicle Exports During April-June This Year Were 14,19,430 Vehicles - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మహమ్మారి నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. భారత్‌ నుంచి వాహన ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 14,19,430 వాహనాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 4,36,500 మాత్రమే. ప్రయాణికుల వాహనాలు 43,619 నుంచి 1,27,115 యూనిట్లకు చేరాయి. వీటిలో కార్లు 79,376 కాగా, యుటిలిటీ వెహికిల్స్‌ 47,151 ఉన్నాయి.

మారుతి సుజుకి 45,056, హ్యుండాయ్‌ మోటార్‌ 29,881, కియా 12,448, ఫోక్స్‌వ్యాగన్‌ 11,566 యూనిట్లను ఎగుమతి చేశాయి. ద్విచక్ర వాహనాలు గడిచిన మూడేళ్లతో పోలిస్తే మెరుగ్గా నమోదు అయ్యాయి. ఈ విభాగంలో 2021–22 తొలి త్రైమాసికంలో 11,37,102 యూనిట్లు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,37,983. వాణిజ్య వాహనాలు 3,870 నుంచి 16,006 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 50,631 నుంచి 1,37,582కు ఎగిశాయి. కాగా విక్రయాలు కోవిడ్‌ ముందస్తు స్థాయికి రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement