India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదేనండోయ్‌..!

India First Electric Car Manufactured By Eddy Current Controls - Sakshi

దేశ వ్యాప్తంగా చమురు ధరలు వీపరితంగా పెరిగి పోతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు బెంబేలేత్తిపోతున్నారు. దీంతో పెట్రోల్‌, డిజీల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించారు.  ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ కోసం లక్షలాది మంది ప్రీ బుకింగ్స్‌ కోసం ఎగబడ్డారు. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలియ జేయడానికి ఇది పెద్ద ఉదాహరణ..! కొనుగోలుదారుల ఆసక్తిని క్యాష్‌ చేసుకోవడం కోసం పలు దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించాయి. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా తొలిసారిగా నెక్సాన్‌ ఈవీ ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. హ్యూందాయ్‌, టెస్లా,  స్కోడా, టెస్లా వంటి దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను భారత్‌లోకి తెచ్చేందుకు పలు చర్యలను తీసుకుంటున్నాయి.
చదవండి: BMW i Vision AMBY : ది సూపర్​ ఎలక్ట్రిక్‌ సైకిల్..! రేంజ్‌ తెలిస్తే షాక్‌..!​

భారత తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదే..!
భారత్‌లోకి ఎలక్ట్రిక్‌ కార్ల వాడకం రిసేంట్‌గా మొదలైదనుకుంటే పొరపడినట్లే. భారత ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి ఎడ్డీ కరెంట్‌ కంట్రోల్‌ కంపెనీ రూపోందించిన లవ్‌బర్డ్‌ తొలి ఎలక్ట్రిక్‌ కారుగా నిలిచింది. లవ్‌బర్డ్‌ను జపాన్‌కు చెందిన యాస్కావా ఎలక్ట్రిక్‌  కంపెనీ సహకారంతో ఎడ్డీ కరెంట్‌ కంట్రోల్‌ 1993లో తయారుచేసింది. ఈ వాహనం మొదట ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఇది ప్రారంభించిన తర్వాత కొన్ని అవార్డులు కూడా అందుకుంది. భారత ప్రభుత్వం కూడా ఈ వాహనానికి ఆమోదం తెలిపింది. 

లవ్‌బర్డ్‌ ఫీచర్స్‌ ఇవే..!
లవ్‌ బర్డ్‌ కారు చూడడానికి చిన్నగా ఉంటుంది. దీనిలో కేవలం ఇద్దరు మాత్రమే కుర్చొడానికి వీలు ఉంటుంది. రీచార్జ్‌బుల్‌ బ్యాటరీ ప్యాక్‌లను ఇందులో అమర్చారు. ఈ కారులో వాడిన బ్యాటరీ ప్యాక్‌లు ఆధునాతనమైనవి కావు. వీటిలో లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీలను ఉపయోగించారు. లవ్‌బర్డ్‌లో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్‌ ఛాపర్‌తో మృదువైన వేగ నియంత్రణ వ్యవస్థను కారుకు అందించింది. కారులో నాలుగు రకాల స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ కారు ఫుల్‌ చార్జ్‌తో 60 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు.  ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆ సమయంలో లేనందున, లవ్‌బర్డ్‌లో ఉపయోగించే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 8 గంటలు పట్టేది. 

కనుమరుగుకావడానికి కారణం ఇదే..!
లవ్‌బర్డ్‌ ఆటోమొబైల్‌ రంగంలో అప్పట్లో ఒక సంచలనంగా నిలిచిన ఎక్కువ రోజులపాటు నిలవలేదు. ఆ సమయంలో ఇంధన ధరలు తక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు ఇతర వాహనాలను కొనేందుకే మొగ్గుచూపేవారు. ఈ కారు ఎత్తైన ప్రదేశాలను ఏక్కడంలో విఫలమైంది.  లవ్‌బర్డ్‌ అమ్మకాలు మూడు అంకెల సంఖ్యను కూడా దాటలేదు. ఆ సమయంలో సరైన విద్యుత్‌ సరఫరా కూడా ఒక్కింత లవ్‌బర్డ్‌ అంతరించిపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చును. లవ్‌బర్డ్‌పై కొనుగోలుదారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ కారుపై అందించే సబ్సీడిని నిలిపివేసింది. భారత ఆటో మొబైల్‌ రంగంలోకి మారుతి సుజుకి 800 రాకతో  వాహన రంగంతో భారీ మార్పులు నమోదు చేసుకున్నాయి. పలు కారణాల వల్ల లవ్‌బర్డ్‌ భవిష్యత్తు తరాలకు కన్పించకుండానే పోయింది. 

చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top